- Advertisement -
బాబు గారూ మీ ‘బ్రాండ్’ నిలబెట్టుకోండి: షర్మిల
Babu, maintain your ‘brand’
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మారు మూల వారికి ఇంకా సాయం అందడం లేదని తెలిపారు. వారికి కూడా సాధ్యమైనంత వేగంగా సాయం అందించి.. మేలు చేయాలని .. మీ బ్రాండ్ నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు నేరుగా పర్యటించారు. మేం సంతోషించాం. కానీ, బాధితులకు అందుతున్న సాయంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని షర్మిల పేర్కొన్నారు.
ప్రజల బాధలు వినని ప్రభుత్వాలు ఎల్లకాలం మనలేవని, దీనికి వైసీపీపాలనే ఉదాహరణ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుతున్న సాయం చాలా మందికి చేరడం లేదని.. వారంతా ఆకలి కేకలు పెడుతున్నట్టు తమకు తెలిసిందని షర్మిల చెప్పా రు. అందరినీ ఆదుకునేందుకు మీ అనుభవాన్ని ఉపయోగించి.. మీరు సేవ చేయాలని కోరుతున్నామని తెలిపారు. “మంచి పరిపాలకుడిగా మీరు పేరుంది. దానిని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం” అని అన్నారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మరింత ప్రయత్నించాలని అన్నారు
- Advertisement -