Sunday, September 8, 2024

బ్యాక్ టూ ఏపీ పోలీస్…!

- Advertisement -

బ్యాక్ టూ ఏపీ పోలీస్…!

ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

ఇక జింతాత జితజితే

సీఆర్డీఎఫ్ నుంచి దిగుమతి

వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు
లా అండ ఆర్డర్ లో తగ్గేది లే
రాజీ పడడు..ఓడి పోడు అందుకే
ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కు
నిఘా సైన్యాధ్యక్షుడి బాధ్యత
ఏరి కోరి తెచ్చిన సీఎం చంద్రబాబు

ఏపీ పోలీసు శాఖలో సేవకు సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. ఆయన 1998 ఏపీ కేడర్‌ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ చంద్ర లడ్డాను ఏపీ సర్వీస్‌లోకి పంపించాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే స్పందించిన కేంద్రం వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సీఎం చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరు ఉంది. లా అండ్ ఆర్డర్‌లో ఆయన రాజీ పడరు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అనే పేరు కూడా ఆయన సొంతం. లడ్డా సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ఎక్కడా తగ్గది లే.. అదే లడ్డా నైజం

2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడి కత్తి ఘటనలో విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌గా చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్‌చంద్ర లడ్డా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1998 ఏపీ బ్యాచ్‌కు చెందిన ఆయన, విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు. గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడమే కాదు, క్లబ్‌లపై దాడులు చేశారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయనను ఏరి కోరి తీసుకొస్తున్నారు. ఆయనకు కీలక నిఘా ఛీప్ బాధ్యతలు అప్పగించటం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్