- Advertisement -
హిందూపురం లో మూడవసారి బాలయ్య నామినేషన్
హిందూపురం
హిందూపురం తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. హిందూపురంలో ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య.. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నామినేషన్‌కు భారీగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు.
- Advertisement -