Wednesday, March 4, 2026

 బాల్కా సుమన్ విడుదల

- Advertisement -

 బాల్కా సుమన్ విడుదల

Balka Suman released
అదిలాబాద్, మార్చి 4
క్యాతనపల్లిలో మంత్రిపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌ బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలో ఆయన హస్తం ఉందని పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో రాజకీయ పార్టీల మధ్య  తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో బాల్క సుమన్ ప్రత్యక్షంగా ప్రమేయం కలిగి ఉన్నారని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత నెల 18వ తేదీన ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్నారు. బాల్క సుమన్ అరెస్టు అక్రమమని, కనీస నిబంధనలు పాటించలేదని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదించారు. ముఖ్యంగా అరెస్టు చేసే సమయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన విధి విధానాలను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు కేసు తదుపరి విచార కోసం సుమన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మంచిర్యాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం పోలీసుల కస్టడీ పిటిష్‌ను తోసిపుచ్చింది. సోమవారం నాడు ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. జిల్లా సెషన్స్‌ జడ్జి ఏ వీరయ్య బాల్క సుమన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. పాతికవేల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించారు. అయితే ఈ బెయిల్‌తో పాటు కోర్టు కొన్ని కఠిన నిబంధనలను విధించింది. ఈ కేసులో ఏ 1, ఏ2 ఏ4, ఏ8 నిందితులుగా ఉన్న వారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా రామకృష్ణాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో హాజరైన సంతకం చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధర్యంలో రాష్ట్రమంతటా పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే బాల్క దుయ్యబట్టారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్, ఆయన కొడుకు ఎంపీ వంశీకృష్ణ 14 మంది కౌన్సిలర్లను కొనే ప్రయత్నం చేశారని అన్నారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేసారని.. అయినా తమ వాళ్ళు తలొగ్గలేదన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి, ఎంపీ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లకు మందు తాగించి వాళ్ళతో తమ మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు.ఇక అక్కడ గొడవ సందర్భంగా రాళ్లు విసిరినోళ్ళ మీద కేసులు బుక్ కాలేదని… మా 25 మంది మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ కాన్వాయ్ ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే.. మాపైనే రివర్స్‌లో కేసు పెట్టారని మండిపడ్డారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. కొడుకు పుట్టిన రోజు టైమ్ లో ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. అందర్నీ కలుపుకుపోయాం తప్ప.. కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. నన్ను జైలులో పెట్టారు కదా.. ఇప్పుడు కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నా అని అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జైలు వద్ద కోలాహలం
బాల్క సుమన్ విడుదలవుతున్నారన్న సమాచారంతో ఆదిలాబాద్‌ జిల్లా జైలు వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో మోహించారు. జైలు గేటు నుంచి ఆయన బయటకు రాగానే శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. విడుదల అనంతరం జైలు ముందే ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు  ఇలాంటి కేసులు పెట్టారని అన్నారు. అనంతం ఆయన అనుచరులతో కలిసి క్యాతనపల్లికి ర్యాలీగా బయల్దేరారు.
నా కొడుకు పుట్టిన రోజనజైల్లోనే ఉన్నా
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మునిసిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి సుమన్ తో పాటు మరికొందరు నేతలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు తమపై లాఠీచార్జ్ చేయడమే కాకుండా, రివర్స్‌లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా, మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, తనను జైలులో పెట్టడం ద్వారా అధికార పార్టీ నాయకుల కడుపు మంట తగ్గిందని అన్నారు. హోలీ పండుగ మరియు తన కుమారుడి పుట్టినరోజున కూడా తనను దూరంగా ఉంచారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్