విజయవంతమైన విద్యాసంస్థల బంద్
-పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు రూపా శంకర్
తాడేపల్లిగూడెం:
ఐక్య విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం తాడేపల్లిగూడెం ఏరియాలో పి డి ఎస్ యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని కాలేజీలు, పాఠశాలలు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు. జిల్లా అధ్యక్షులు రూపా శంకర్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్టిఏ) జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందన్నారు. తీవ్రమైన అవకతవకులు జరిగాయన్నారు. బాధ్యతారాహిత్యం తో పరీక్షలు నిర్వహించారు అన్నారు. నీటి పరీక్ష లీకేజ్ తెర వెనుక కుంభకోణం జరిగే అన్నారు. నీట్-పీజీ పరీక్షలను 12 గంటల ముందు వాయిదా వేయడం జరిగిందన్నారు. యు జి సి నెట్ పరీక్ష రద్దు చేయడం వంటివి విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. నీటి స్కాంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు. ఎన్ టి ఏ వ్యవస్థను రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని. ఇటీవల నెట్, నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పీహెచ్డీ అడ్మిషన్లు కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలన్నారు. విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులు, నిర్బంధాలు యూనివర్సిటీలలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేత చర్యలు ఆపాలన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలని. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, నీటి పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరాజు, జి రాజేష్, ఎన్ బబ్లు, బి లక్ష్మణ్, బన్నీ, ఏఐఎస్ఎఫ్ లైఫ్ నాయకులు రాజేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు పి నాగేంద్రబాబు, పవన్ తదితరులు పాల్గొన్నారు.