ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్ ఫైర్
హన్మకొండ
ఎల్కతుర్తి మండలంలో గత రెండు రోజుల క్రితం అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కరీంనగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మండల కేంద్రంలోనీ వ్యవసాయ మార్కెట్ వద్ద పరిశీలించారు. తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కొనుగోలు కేంద్రంలో కొంత మాత్రమే వరి ధాన్యం తడిస్తే దానిని ఆసరా తీసుకొని దళారులు మొత్తం ఈ సెంటర్లోని ధాన్యం తడిసిపోయిందని క్వింటాలకు 6 నుంచి పది కిలోలు కట్ చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అన్నారు. అధికారులు తడిసిన ధాన్యం పరిశీలించడానికి ఒకటి,రెండు సార్లు వచ్చి వెళ్లిన వెంటనే దళారులు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని, వారి పై చర్యలకు ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదని అన్నారు.
రైతులకు 500 బోనసిస్తా అని చెప్పి ఇప్పుడు ఆ మాట దాటేసారని ఏ రైతు అకౌంట్లో డబ్బులు వేశారు తెలపాలని డిమాండ్ చేశారు.భగవద్గీత,బైబిల్, ఖురాన్ మీద ప్రమాణం చేసి హామీలు అమలు చేస్తమని తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఎక్కడ లేదని,అంటే వాటి మీద గౌరవం లేనట్లు, నమ్మకం లేనట్లేనా అని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గతంలో కంటే నేడు వరి ధాన్యానికి మద్దతు ధర పెరిగిందని రైతులు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు.
ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్ ఫైర్
- Advertisement -
- Advertisement -