Sunday, September 8, 2024

బండి సంజయ్ నువ్వు అబద్దాల ఆరోపణలు చేస్తే నీ ప్రచారాన్ని అడ్డుకుంటామం —బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్

- Advertisement -

బండి సంజయ్ నువ్వు అబద్దాల ఆరోపణలు చేస్తే నీ ప్రచారాన్ని అడ్డుకుంటామం —బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్

కరీంనగర్, నవంబర్ 14 (వాయిస్ టుడే): బండి సంజయ్ నువ్వు అబద్దాల ఆరోపణలు చేస్తే నీ ప్రచారాన్ని అడ్డుకుంటామాని బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ హెచ్చరించారు. హరిశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారని యువతను కించపరిచే విధంగా ఎంపి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. యువతకు బండి వెంటనే క్షమాపణ చెప్పాలి. 2014, 2018,2019 ఎన్నికల్లో యువత నీ వెంటే ఉంది… నువ్వేమైనా గంజాయికి బానీస చేశావా. యువతను వంచించి… వారిని కేసుల్లో ఇరికించి… యువకుల జీవితాలతో చెలగాటమాడిన ఘనత బండి సంజయ్ ది. నాడు నీ వెంట ఉన్న యువకులు… ఇప్పుడు నీ మాటలు నమ్మకుండా…. మంత్రి గంగుల సమక్షంలో బిఆర్ఎస్ లో చేరుతున్నారు.
ఇది తట్టుకోలేని నువ్వు యువకులపై అబద్ధపు ప్రచారాన్ని మొదలెట్టవు.
బండి నీ మాటల్లో అబద్ధం లేకపోతే… మత్తుమందుకు అలవాటు పడిన ఒక బిఆర్ఎస్ యువకుడిని చూపించు. మంత్రి గంగుల భూములను కబ్జా చేశాడని చెబుతున్న నువ్వు… మంత్రి భూములను ఎక్కడ కబ్జా చేశాడో నిరూపించాలి. నరం లేని నాలికుందని బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను జాతీయ స్థాయి నాయకుడిని విర్రవీగే బండికి… ఇప్పుడు తుస్సుమనే పరిస్థితి నెలకొంది.
రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ కి డిపాజిట్ కూడా దక్కదు. స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత బోయినిపల్లి
వినోద్ కుమార్ దైతే… అది నా ఘనత అని బండి చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జికి అప్లికేషన్ పెట్టింది… మంజూరు చేయించింది బోయినిపల్లి వినోద్ కుమారే. రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపనకు రాకుండా ముఖం చాటేసిన ఘనత బండి సంజయ్ ది. నీకు ఓటేసి ఎంపీగా గెలిపించిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై మేము బహిరంగ చర్చకు సిద్ధమని ఇప్పటికే చెప్పాను. ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపాయి తేలేని అసమర్ధుడు బండి సంజయ్. 1952 నుండి ఇప్పటివరకు ఫెయిల్యూర్ అయిన ఒకే ఒక ఎంపీవి నువ్వు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారిని చూపించకపోతే నీ ప్రచారాన్ని అడ్డుకుంటాం. సెల్ ఫోన్లు పంపిణీ చేసే ఆలోచన నీదే కావచ్చు… ఆ నెపాన్ని మంత్రి గంగుల మీద నెట్టేస్తున్నారు. ఓటుకు పదివేలు పంచడమనేది కూడా నీ ప్లానే కావచ్చు. మేము ఓట్లకు డబ్బులు పంచామని చెబుతున్న బండి… దాన్ని నిరూపించాలి. భార్య పుస్తెలు అమ్ముకున్న నీకు ఇప్పుడు వందల కోట్లు ఎలా వస్తున్నాయి. 2020 నుండి 2023 వరకు నీ ఆస్తులు ఎలా పెరిగాయి. ప్రజలు తన మాటలు నమ్మడం లేదన్న డిప్రెషన్లో సోయి లేకుండా… మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. మంత్రి గంగుల మరోసారి గెలిస్తే కరీంనగర్లో హిందువులు బొట్టు ధరించడం… కంకణం కట్టుకోలేని పరిస్థితులు వస్తాయని అనడం దారుణం.
నువ్వు పుట్టకముందే కరీంనగర్లో దేవాలయాలు ఉన్నాయని సంగతి మరచిపోవద్దు బండి. కరీంనగర్ లోని హిందువులను బండి అవమానిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటు… టిటిడి ఇస్కాన్ దేవాలయాలను నిర్మిస్తున్న పెద్ద హిందువు గంగుల కమలాకర్.
హిందువని చెప్పుకుంటున్న నువ్వు ఎక్కడైనా ఒక ఆలయ అభివృద్ధికి రూపాయి ఇచ్చావా. కరీంనగర్లో హిందువుల స్వేచ్ఛకు భంగం ఎక్కడ కలిగింది బండి సంజయ్ చెప్పాలి. నగరంలో కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారు… శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయి. ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకున్నట్టుగా… బండి ఇతరులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినట్టుగా చెబుతున్నాడు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే బండి సంజయ్ ప్రచారాన్ని అడ్డుకుంటాం. టిఆర్ఎస్ లో చేరిన యువత భవిష్యత్తుకు బాటలను గొప్పగా వేస్తున్న ఘనత గంగులది. పౌరసర పరాల శాఖ మంత్రిగా నిరుపేదలకు లక్షలాది రేషన్ కార్డులను పంపిణీ చేశారు. బండి అబద్దాలతో ప్రజలను ఒప్పించలేవు… ఎంపీగా ప్రజల వద్ద చులకనకాకు. అబద్దాలకోడు బండి సంజయ్… అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోము.
రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతవుతుందని డిప్రెషన్ తో బండి మాట్లాడుతున్నారు. తన మాటలు ఎవరు పట్టించుకోవడంలేదని… మున్సిపల్ మేయర్ పదవి ఎంఐఎంకేనని అబద్దపు ప్రచారానికి తెర తీశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ డిప్యూటీ మేయర్ రెండు పదవులు బిఆర్ఎస్ వే అని అన్నారు. ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్ అలీ, మైనార్టీ నగర ప్రధాన కార్యదర్శి వాజిద్, బిఆర్ఎస్ పార్టీ నగర యూత్ అధ్యక్షులు కుల్దీప్, యూత్ ప్రధాన కార్యదర్శి సాయి, కరీంనగర్ నియోజకవర్గ
బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు నవాజ్, బిఆర్ఎస్ పార్టీ 55 వ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, వంగ హరీష్, సత్తినేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్