సిపిఐ పార్టీలో బండ్ల ఆదం సేవలు చిరస్మరణీయం
Bandla Adam's services in CPI party are memorable
పల్నాడు సిపిఐ పార్టీ నాయకులు నివాళులు
దాచేపల్లి,
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కామ్రేడ్ బండ్ల ఆదాం అని సిపిఐ గురజాల నియోజకవర్గం కార్యదర్శి మందపాటి రమణారెడ్డి అన్నారు. నారాయణపురం లోని సిపిఐ మండల కార్యాలయం నందు ఆదాం 5వ వర్ధంతి జరిగింది. ఆదం చిత్రపటానికి తలనాకుల సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. రమణారెడ్డి మాట్లాడుతూ మందపాటి నాగిరెడ్డి మరియు బుర్రి సైదా రెడ్డి ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు అనేక భూ పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టులను నిర్బంధించినప్పుడు కమ్యూనిస్టు నాయకులకు కొరియర్గా పనిచేశారన్నారు. గుంటూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా భారత కమ్యూనిస్టు పార్టీ హోల్ టైమర్ గా కూడా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కొమెర వెంకటరావు వేముల వెంకటరెడ్డి బుర్రి కృష్ణారెడ్డి డాక్టర్ విజయ వాణి సౌజన్య లాయర్ కిరణ్ బండ్ల క్రాంతి కౌన్సిలర్ క్రాంతి మురికిపూడి సర్వయ్య ఎడ్ల భాస్కర్ తమ్మిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.