ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బానోత్ సుందర్ లాల్, బాదావత్ బాలాజీ

- Advertisement -

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బానోత్ సుందర్ లాల్, బాదావత్ బాలాజీ

ఖమ్మంలో ఘనంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో నేతల నివాళి

వాయిస్ టుడే/ వైరా ప్రతినిధి:

Banoth Sundar Lal and Badavath Balaji participated in the NTR birth anniversary celebrations.

మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన వేడుకల్లో వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజా సంక్షేమానికి కొత్త దిశానిర్దేశం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.రాజకీయాల్లో ఎన్టీఆర్ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శం. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికి ఆయన ప్రతీక అని నాయకులు పేర్కొన్నారు తెలుగు జాతి గర్వకారణమైన ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. కార్యక్రమంలో వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, యండ్రాతి మోహన్‌రావు, భూక్య బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, అభిమానులు కలిసి ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular