- Advertisement -
బాపురం గ్రామ అభివృద్ధి కృషి
Bapuram village development effort
:సర్పంచ్ శిల్పారెడ్డి, వైసిపి మండల నాయకుడు గుర్నాథ్ రెడ్డి
కౌతాళం
గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని బాపురం గ్రామ సర్పంచ్ శిల్పారెడ్డి మరియు వైసీపీ నాయకులు గురునాథ్ రెడ్డి పేర్కొన్నారు.వారు మాట్లాడుతూ గ్రామంలో గత నాలుగు రోజుల నుంచి డ్రైనేజ్ కాలువలో పూడికతీత మరియు జెసిబి ద్వారా ముళ్ళకంపలు తొలగించడం జరిగిందని.గ్రామ ప్రజలు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచు కోవాలని డెంగ్యూ, మలేరియా, రోగాల రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను సూచించారు. ఎమ్మెల్యే సహకారంతో నిరంతరం గ్రామ అభివృద్ధికి దోహదపడుతామని వైసిపి నాయకులు గురునాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు అయ్యప్ప రెడ్డి, దేవరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి,జైపాల్, ఉపసర్పంచ్ రామాంజనేయులు, పాల్గొన్నారు.
- Advertisement -