- Advertisement -
హైదరాబాద్: నగర శివారు ఐడీఏ బొల్లారంలో భారీగా మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి 90 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నుంచి వీటిని తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో వాటిని పెట్టి బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు నగరంలోనూ సప్లై చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -