

మున్నూరుకాపు మహిళా శక్తి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా శక్తి అధ్యక్షురాలు బండి పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రంతో పాటు నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలుస్తూ ఆటలు ఆడారు. బండి పద్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ మహిళా శక్తిని చాటుతుందని, మున్నూరుకాపు . మహిళా శక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అనేక మహిళా చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నామని, వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామన్నారు.


కేంద్రం కేటాయించిన 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎల్. వేణుగోపాల నాయుడు, తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, రాష్ట్ర కోఆర్డినేటర్లు పగడాల అరుణ్ కుమార్,దాదె వెంకట్,తుడి జనార్ధన్,టి జి ఓ ఏనుగుల సత్య నారాయణ, మున్నూరుకాపు ఉద్యోగస్థుల సంఘము అధ్యక్షులు బాల శ్రీనివాస్,ఉద్యోగుల సంఘము నేతలు సమీర్, అర్ముర్ శ్రవణ్, ఏనుముల రాజు,తెలంగాణ మున్నూరుకాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పెరుక రమేశ్, మున్నూరుకాపు మహిళా శక్తి నాయకురాలు చామకూర సుజాత, మన్నెం అరుణ, పొన్నం సునీత, ఆకుల సంధ్య, చికోటి కవిత, తులసి, బండి ఆరుంధతి, శ్రీలక్ష్మి, వై. శైలజ, అరుణ, మమత, అండాలు పటేల్ యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ అఖిల్ పటేల్, అభిషేక్ పటేల్, రాజేందర్ పటేల్, నిఖిల్, ప్రశాంత్, సాయి చరణ్, శ్రీకాంత్, క్రాంతికుమార్ పటేల్, మహిళా వింగ్ కన్వీనర్ దివ్య, తదితరులు పాల్గొన్నారు.



