Sunday, September 8, 2024

బతుకమ్మ చీరలు చేనేత కార్మికుడి కన్నీళ్లు తుడిచే పథకం: కేసీఆర్ (ప్రసంగం వీడియో తో )

- Advertisement -
Bathukamma saree weaver scheme to wipe the tears: CM KCR
Bathukamma saree weaver scheme to wipe the tears: CM KCR

సిరిసిల్ల జిల్లా:అక్టోబర్ 17:  తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది.  ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ఈ సమరంలో గెలవాలని.. గవర్నమెంట్ ఏర్పరచాలని ఆలోచనలో ఉన్నాయి. ఇక అధికార పార్టీ బీఆర్ఎస్ విషయానికి వస్తే అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల డేట్ తరువాత ప్రజా గర్జన సభలు అంటూ బిజీ బిజీగా మారిపోయింది.

ఈ రోజు సిరిసిల్లలో జరుగుతున్నా ప్రజా గర్జన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..సమైక్య పాలనలో మానేరులో దుమ్ములేసేది. ఇపుడు మన స్వరాష్ట్ర పాలనలో అప్పర్ మానేరు మత్తడి దుంకే పరిస్థితి మనం చూస్తున్నాం..  కలలో అనుకున్న అభివృద్ధి ఇప్పుడు సిరిసిల్లలో కళ్లారా కనపడుతుంది.

కేటీఆర్ సిరిసిల్లలో గెలిచిన తర్వాత చేనేతల కార్మికుల దశ మారింది. చేనేత కార్మికులు బ్రతకాలి.. వారి కుల వృత్తి మగ్గాలకు పని ఉండాలి.. చేనేత కార్మికులకు పని కల్చించే దృష్టితోనే బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభించాం.

Bathukamma saree weaver scheme to wipe the tears: CM KCR
Bathukamma saree weaver scheme to wipe the tears: CM KCR

బతుకమ్మ చీరలు చేనేత కన్నీరు తుడిచే పథకం. కానీ కొంత మంది బతుకమ్మ చీరలపై కూడా రాజకీయం చేస్తున్నారు. కొన్ని చోట్ల బతుకమ్మ చీరలు తగలబెట్టడం నీచాతినీచమని కేసీఆర్ అన్నారు.   నా 70 ఏండ్ల జీవితంలో వందలసార్లు సిరిసిల్లలో తిరిగాను ఇప్పడు మానేరు సజీవ జలధారగా మారింది. ఎండకాలంలో కూడా అప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.. ఇవన్నీ చూస్తుంటే కడుపు నిండుతోంది.

గతంలో సిరిసిల్ల ప్రాంతంలో గోడలపై రాతలు చూసి మనసు చలించేంది, అందుకే సిరిసిల్ల మరో షోలాపూర్‌గా మారాలన్నదే నా ధ్యేయం. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని గోడలపై  రాతలుండేవి, బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ. 50 లక్షలు ఇచ్చి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకున్నాము..

ఆసరా పెన్షన్ రూ. 5 వేలకు పెంచాము.. రేషన్‌ ద్వారా సన్నబియ్యం ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్