- Advertisement -
మేడారం మహా జాతరలో బ్యాటరీ కారు సేవలు
దివ్యాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీ కారు వినియోగం
బ్యాటరీ కారు పని తీరు పరిశీలించిన జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్
మేడారం
తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరలో వృద్దులకు, దివ్యాంగులకు బ్యాటరీ కారు సేవలను రాష్ట్ర ప్రభుత్వం (దేవాదాయ శాఖ) అందుబాటులోకి తీసుకొని వచ్చింది. గురువారం జాతర ప్రాంగణంలో ఉన్న బ్యాటరీ కారు పని తీరును దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ట్రయల్ రన్ ద్వారా పరిశీలించారు. నడవలేని సీనియర్ సిటిజన్లను, దివ్యాంగులను సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం వరకు తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు బ్యాటరీ కార్లను వినియోగించనున్నారు
- Advertisement -