- Advertisement -
ఆళ్ళగడ్డ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బత్తిని శివ ప్రసాదరావు
Battini Siva Prasada Rao as Assistant Public Prosecutor of Allagadda Assistant Sessions Court
అళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అదనపు బాధ్యతలను ఆళ్లగడ్డ 5వ జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తిని శివ ప్రసాదరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంత కాలం వరకు ఆళ్లగడ్డ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంచార్జీగా నంద్యాల అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలక్రిష్ణా రెడ్డి వుండేవారు ఆయన స్థానంలో బత్తిని శివ ప్రసాదరావు కు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంచార్జి బాధ్యతలును అప్పగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. దీనితో బత్తిని శివ ప్రసాదరావు ఆళ్ళగడ్డ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించడంతో ఆయనకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
- Advertisement -