బిసి కులగణనతో బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు
జిల్లా బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గంగం జలజ
జగిత్యాల,
:
బిసి కులగణనతో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుందని జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గంగం జలజ అన్నారు.
మంగళవారం ఆమే విలేకరుల మాట్లాడుతూ
బిసిల కులగణనకు ఆమోదం తెలుపుతూ అసెంబ్లీ లో తీర్మానం చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిసి సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బిసి కులగణన పై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని, దీనికి రాష్ట్రంలోని బిసి సమాజం తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కులగణన కోసం అనేక సార్లు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద, హైదరాబాదు లోని ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసి బిసిల గురించి నిరంతరం పోరాటం చేస్తూ బిసిల అభ్యుదయానికి కృషి చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాట ఫలితమే కుల గణన అని ఆన్నారు.. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి బీసీ వర్గాలు ఎంత రుణపడి ఉంటారన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి బిసి కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.