పెన్షన్లు పంపిణీ చేసిన రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి…
BC Janardhan Reddy, Minister of Roads and Buildings distributed the pensions...
కొలిమిగుండ్ల, ఆగస్టు 31,
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులు, వికలాంగులకు అనుకున్న టైం కంటే ఒకరోజు ముందుగానే రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శనివారం నాడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఒక్కరోజైనా పెన్షన్లను ముందే పంపిణీ చేశారా అదే మా టిడిపి ప్రభుత్వంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఒకరోజు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదేనని, రానున్న కాలంలో త్వరలోనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



