Sunday, February 15, 2026

బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమీక్ష-హజరయిన మంత్రి పొన్నం

- Advertisement -

బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమీక్ష-హజరయిన మంత్రి పొన్నం

BC Welfare Department Officials Review - Minister Ponnam Attended

హైదరాబాద్
బంజారాహిల్స్ కొమురంభీమ్ భవన్ లో తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విసృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరైయారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి,గురుకుల సెక్రటరీ సైదులు , ఎంబీసీ కార్పోరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, అడిషనల్ డెరైక్టర్ చంద్ర శేఖర్,  జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయి బ్రాహ్మణ ఎండీ ఇందిరా ,బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , టాడి టాపర్ కార్పోరేషన్ ఎండీ ఉదయ్ కుమార్, డిబిసిడివొస్, ఏడిబిసిడివొస్, ఆర్సివోస్, డిసివోస్, ప్రిన్సిపల్స్ ,హాస్టల్ వార్డెన్లు పాల్గోన్నారు.
బీసీ సంక్షేమ శాఖ లో కింది స్థాయి పై వరకు అధికారుల పనితీరు పై సమీక్ష జరిపారు. గురుకుల తాజా పరిస్థితి పై ఆరా తీసారు.
క్షేత్ర స్థాయిలో హాస్టల్ ,గురుకుల లు ఎదుర్కుంటున్న సమస్యల పై  మంత్రి అడిగి తెలుసుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కింది స్థాయి నుండి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన లో విద్యా కు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుంది. ఇప్పటికే పాఠశాలలో 1100  కోట్లతో 25 వేల స్కూల్ లకు మౌలిక సదుపాయాలు కల్పించాం. గత 10 సంవత్సరాలుగా బదిలీలు , ప్రమోషన్లు   లేక ఇబ్బందులు పడుతున్న  ఉపాధ్యాయ లోకానికి  19 వేల ప్రమోషన్లు ,35 వేల బదిలీలు చేపట్టామని అన్నారు. ప్రతి స్కూల్ కి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కల్పిస్తున్నాం. శానిటేశన్ కి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది. గత దశాబ్ద కాలంగా నిరుత్సాహం లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్లకు కూడా బదిలీలు చేపట్టాం. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూల్ లో 9 వేల నియామకాలు చేపట్టామని అన్నారు.
కొత్తగా నియామకాలు అయినా వారిని కూడా ఎలాంటి పైరవీ  లేకుండా బదిలీలకు అవకాశం ఇవ్వడం లేదు. నిన్ననే డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్  కాంప్లెక్స్ భవనాల నమూనా విడుదల చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉన్న మాదిరి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ నెల 11 న  శంఖు స్థాపన చేసుకుంటున్నాం. ఈ సంవత్సరానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాలకు 5 వేల కోట్లు కేటాయించడం జరిగింది. గురుకుల పాఠశాల లకి రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. గురుకులల్లో స్పోర్ట్స్ ,కల్చరల్ యాక్టివిటీస్ పెంచాలి. మీ దగ్గర నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. అధికారుల పనితీరు మెరుగుపడాలి. రాష్ట్రంలో గురుకులాల్లో 98 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. 326 గురుకుల పాఠశాలలో 21 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.. మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దసరా లోపు వాటి 50 శాతం అద్దెలు చెల్లిస్తాం.. వెంటెన్ మౌలిక సదుపాయాలు కల్పించేలా యాజమానుల తో మాట్లాడాలి . గురుకులాల్లో చెత్త ,గడ్డి లేకుండా ఉండడానికి ఉపాధి హామీ ద్వారా శుభ్రపరచాలనీ కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చాం. క్షేత్ర స్థాయిలో మీరు ఎదుర్కుంటున్న సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. అధ్యాపకులు నిరంతరం శ్రనిస్తున్నారను పేరు తెచ్చుకోవాలి. ఈనెల 9 వ తేదిన డీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్