జరాభద్రం… హీట్ స్ట్రోక్ జాగ్రత్త
హైదరాబాద్, ఏప్రిల్్ 16, ( వాయిస్ టుడే)
Be Careful… Watch Out for Heatstroke.
ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉదయం 9 నుంచే ఎండ విజృంభిస్తుంది. కానీ ఈ సమయంలో చాలామంది ఆఫీస్లకు వెళ్తూ ఉంటారు. లేదా తప్పనిసరి పనుల
నేపథ్యంలో, వివిధ కారణాలతో చాలామంది బయటకు వెళ్లాల్సి వస్తుంది. బస్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో వెళ్లేవారికి ఎలాగో కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ బైక్పై వెళ్లేవారికి ఈ పరిస్థితి కొంచెం దారుణంగా
ఉంటుంది. ఎండలో బైక్పై వెళ్లడమే దారుణం అంటే.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడమనేది డెడ్లీ కాంబినేషన్. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ రేంజ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన
జాగ్రత్తలు తీసుకోకపోతే డీహైడ్రేషన్, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎండలో బైక్ మీద బయటకు వెళ్లేప్పుడు.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చినప్పుడు
కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవి మీ అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఫుల్ కవరేజ్ డ్రెస్సింగ్
మీరు బైక్పై ప్రయాణిస్తుంటే.. షార్ట్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ షర్ట్లు.. కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. ఇవి సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చేతులు టాన్ కాకుండా ఉంటాయి.
హెల్మెట్‌తో పాటు స్కార్ఫ్
బైక్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. హెల్మెట్ వల్ల హీట్ వస్తే అది చెమట రూపంలో జుట్టు, ముఖాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఆ చెమటన పీల్చుకునేందుకు
వీలుగా స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇది ముఖం, మెడ కవరయ్యేలా చేసి.. హీట్ తగ్గిస్తుంది.
వాటర్ బాటిల్
ఎండలో బైక్ డ్రైవింగ్ చేస్తే చెమట ఎక్కువగా వస్తుంది. కాబట్టి చిన్న వాటర్ బాటిల్ వెంట తీసుకుని వెళ్లండి. డీహైడ్రేట్ కాకుండా మధ్యలో నీళ్లు తాగుతూ వెళ్లొచ్చు.
ఖాళీ కడుపుతో
బైక్‌పై బయటకు వెళ్లే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఖాళీ కడుపుతో వెళ్తే త్వరగా అలసట, బలహీనత వస్తుంది. ఎండ వల్ల ఈ అలసట పెరిగి డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు
ఎదుర్కోవాల్సి వస్తుంది.
సన్ గ్లాసెస్ వాడండి
హెల్మెట్ తలకు రక్షణ ఇస్తుంది. కానీ ఎండ కాంతి కళ్లపై ప్రభావం చూపకుండా సన్గ్లాసెస్ పెట్టుకోవాలి. UV ప్రొటెక్షన్ గ్లాసెస్ ఉపయోగిస్తే కళ్లకు రక్షణ ఉంటుంది. పైగా కాంతి నేరుగా మీ కళ్లను ఇబ్బంది
పెట్టకుండా కూలింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు..
మీరు అనుకోకుండా ట్రాఫిక్లో సిగ్నల్ వద్ద ఎక్కువసేపు ఆగాల్సి వస్తే బైక్ ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. ఇది వేడి తగ్గించడంలో సహాయపడుతుంది.
బ్రేక్స్ తీసుకోండి
ఎక్కువ దూరం డ్రైవ్ చేయాల్సి వస్తే.. మధ్యలో బ్రేక్లు తీసుకోండి. చెట్టు నీడలో లేదా షేడ్‌లో ఆగి కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువసేపు ఎండలో డ్రైవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు.
సన్‌స్క్రీన్ తప్పనిసరి
బయటకు వెళ్లే ముందు SPF ఉన్న సన్‌స్క్రీన్ కచ్చితంగా అప్లై చేయండి. ఇది సన్‌బర్న్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సమస్యలు, స్కిన్ క్యాన్సర్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది.
హీట్ స్ట్రోక్ లక్షణాలు
మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు తలనొప్పి, వాంతులు, చెమట ఆగిపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకుని నీళ్లు తాగాలి. ఇవి హీట్ స్ట్రోక్ లక్షణాలు. కాబట్టి ఆ సమయంలో
డ్రైవింగ్ చేయడం అంత మంచిది కాదు. హైడ్రేటింగ్ ఫుడ్స్ కూడా హీట్ స్ట్రోక్ లక్షణాలను తగ్గిస్తాయి. కాబట్టి ఎండలో బైక్పై వెళ్లేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. అలాగే వీలైనంత వరకు అవసరం
లేకుంటే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం మానుకోండి. వెళ్లాల్సి వస్తే మాత్రం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోండి.



