Sunday, September 8, 2024

బీరు.. ఫుల్ డిమాండ్

- Advertisement -

బీరు.. ఫుల్ డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 5
సమ్మర్ వచ్చిందంటే చాలు.. కూల్ కూల్‌ ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులకు ఎంత డిమాండ్ ఉంటుందో.. అంతకు రెట్టింపు డిమాండ్ బీర్లకు ఉంటుంది. సాధారణంగా మద్యం ప్రియుల్లో ఒకరికి విస్కీ ఇష్టమైతే మరొకరికి బ్రాండీ నచ్చుతుంది.. ఇంకొకరికి వొడ్కా నచ్చుతుంది. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకం ఇష్టముండగా.. వేసవి వచ్చేసరికి మాత్రం మద్యంప్రియులంతా చల్లచల్లని బీర్లకే జై కొడుతుంటారు. ఏ చిన్న అకేషన్ వచ్చినా కాటన్లు కాటన్లు బీర్లు ఖాళీ చేసేస్తుంటారు. బయట ఎండలు మండిపోతుంటే.. లోపల ఓ చల్లని బీరేస్తే ఉంటది నా సామిరంగా అంటూ మద్యంప్రియులు మిగతావారికి కూడా నోరూరిస్తూంటారు. అయితే.. ఇప్పుడు మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఈ వేసవిలో బీర్లు వేస్తూ చిల్ అయ్యే ఛాన్స్ మందుప్రియులకు దొరకటం కష్టంగా మారనున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేటలోని మద్యం డిపోకు బీర్ల సరఫరా చాలా వరకు నిలిచి పోయింది. వచ్చిన నిల్వలను డిపో పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లకు రేషియో పద్ధతిన సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే బీర్ల కొరత ఏర్పడగా.. కొద్ది రోజుల్లో మరింత తీవ్రం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో పలు కంపెనీలు సర్కార్ లిక్కర్‌ గోదాంలకు సరఫరా చేసిన బీరు నిల్వలకు ఇప్పటికీ బకాయిల చెల్లించలేదని.. అందులో ఇప్పుడు కొత్తగా సరుకు రావటట్లేదని చెప్తున్నారు.గుడిపేట లిక్కర్‌ డిపో పరిధిలో మొత్తం 135 మద్యం దుకాణాలు, 28 వరకు బార్లు ఉన్నాయి. సమ్మర్ సమయంలో వీటిల్లో పెద్దఎత్తున బీర్ల అమ్మకాలు సాగనున్నాయి. గతేడాది మార్చిలో సుమారు 2 లక్షల వరకు బీర్ల కేసులు అమ్మినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 1.80 లక్షల వరకు బీరు కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. గత ఏడాది బీరు కేసులు మద్యం దుకాణాల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరిగి డిపోలో లక్షల కేసుల నిల్వలు ఉండేవి. ఇప్పుడు బీరు కేసులు వచ్చినవి వచ్చినట్లు విక్రయిస్తుండగా.. డిపోలో నిల్వలు ఉండడం లేదు. ఈ లెక్కన డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేదని తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్