హైదరాబాద్, నవంబర్ , (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన పొరపాటులు ఈసారి పునరావృతం కాకుండా ఈసి పలు సూచనలు చేసింది.అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిపై ప్రత్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కోర్టులను ఆశ్రయించడంతో ఎమ్మెల్యేగా గెలిచినా ఎన్నికల నియమావళిని పాటించనందుకు వారిని ఎమ్మెల్యేగా అనర్హులు అంటూ రెండు మూడు కేసులో కోర్టు తీర్పునిచ్చింది.ఈసారి అలాంటి తప్పులు తలెత్తకుండా అభ్యర్థులకు ఈసీ పలు సూచనలు చేసింది.
ఈ నిబంధనలు తప్పనిసరి:
• ఓటు హక్కు ఉన్న నియోజికవర్గంలో కాకుండా మరొక నియోజికవార్గం నుండి అభ్యర్థి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్లుగా ధృవీకరణ పత్రం సమర్పించాలి.
• ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజికవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ల పాత్రలు దాఖలు చేయవచ్చు.
• గుర్తింపు పొందిన రాష్ట్ర లేదా జాతీయ పార్టీ అభ్యర్థి కోసం అదే నియోజికవార్గంలో ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది.గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి లేదా స్వతంత్రత అభ్యర్థి కోసం అదే నియోజికవార్గంలో పది మంది ఓటర్లు ప్రతిపాదించల్సి ఉంటుంది.
• ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ జాయింట్ అకౌంట్లు తెరవొద్దు.ఒక్కో అభ్యర్థి పేరు మీద కేవలం ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి.
• ఎస్సీ ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వర్గాలకు చెందిన వారే ఉండాలి అందుకోసం కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
• సెక్యూరిటీ డిపాజిట్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించాలి.
• నామినేషన్ దాఖలు చేసే సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి.అందులో అభ్యర్థి వివరాలు,ఆస్తి వివరాలు తదితర వివరాలన్నీ సరినవిగా ఉండాలి.
• రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపలకి అభ్యర్థి వెంట కేవలం అయిదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది.
• అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే అర్హత కేవలం రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది.
• నామినేషన్లను పరిశీలించే సమయంలో అభర్ధితో పాటు ఎలక్షన్ ఏజెంట్,అభ్యర్థి ప్రతిపాదించిన వారిలో ఒకరు ( న్యాయవాది కూడా వెళ్లొచ్చు ).
• నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఊరేగింపు వంటివి అపలి.
• ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థి ప్రతిపాదించిన వ్యక్తి నామినేషన్ల సమయంలో లేకపోతే వారి నామినేషన్ తిరస్కరణకు గురి అవుతుంది.
నామినేషన్ చేసే ముందు ..
- Advertisement -
- Advertisement -