Sunday, September 8, 2024

బిచ్చగాళ్ల కే  బిచ్చగాడు.. ఇదో రకం మాఫియా

- Advertisement -

హైదరాబాద్ లో బెగ్గర్ మాఫియా

Beggars are beggars.. This is a type of mafia
Beggars are beggars.. This is a type of mafia

హైదరాబాద్, ఆగస్టు 18: హైదరాబాద్‌లో అనిల్‌ పవార్‌ అనే వ్యక్తి బెగ్గింగ్‌ మాఫియాకు తెరతీశాడు. ముసలి వాళ్లను తీసుకువచ్చి వారితో బిక్షం ఎత్తిస్తూన్నాడు. జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ దగ్గర బిక్షటన చేయిస్తూన్నాడు. వారు రోజంతా కష్టపడి సంపాదించినది తాను తీసుకుని, వారికి రూ. 200 కూలి ఇస్తున్నాడు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు బెగ్గింగ్‌ మాఫియా గుట్టు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద బిక్షం ఎత్తుకుంటున్న మొత్తం 23 అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద అనిల్ పవార్ పై కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్‌ చేశారు.హైదరాబాదులో యాచకులు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. సిగ్నల్ పడగానే రోడ్లపై వాలిపోయి డబ్బులు కోసం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బులు ఇస్తే హ్యాపీ.. లేదంటే బూతులతో విరుచుకుపడతారు. దింతో బిచ్చగాళ్ళు అంటే భయపడే స్థాయికి నగరవాసుల చేరుకున్నారు. పదులు కాదు.. వందలు కాదు.. వేలల్లో నగరవ్యాప్తంగా బిక్షాటన చేసేవారు ఉన్నారు. వీరంతా ఎక్కడి నుండి వచ్చారు.. వీరందరికీ ఆశ్రయం కల్పిస్తుంది ఎవరు.. అసలు ఈ బెగ్గింగ్ మాఫియా వెనక ఎవరున్నారు..? అన్న విషయాలను నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు. ఈ మాఫియా లీడర్ అనిల్ పవార్‌ను అదుపులోకి తీసుకున్నారు.అనిల్ పవర్ బెగ్గింగ్ మాఫియాకు ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాడు. అసలు ఎవరు ఈ అనిల్ పవార్.. ఎక్కడి నుంచి వచ్చాడు.. ఎలా ఈ బెగ్గింగ్ మాఫియాను ఆర్గనైజ్ చేస్తున్నాడు అని పోలీసులు విచారణ చేయగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కర్ణాటక కు చెందిన అనిల్ పవార్ కొన్నేళ్ల క్రితం వచ్చాడు. ఈజీ మనీ కోసం బెగ్గింగ్ మాఫియాను ఎంచుకున్నాడు. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన ముసలి వాళ్లను, అనాధలను, ఏ తోడు లేని ఒంటరి మహిళలని టార్గెట్ గా చేసి నగరానికి తీసుకొచ్చాడు. వారందరికీ ఆశ్రయం కల్పించి బెగ్గింగ్ పాయింట్లను కేటాయించాడు. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ చౌరస్తా, ఖైరతాబాద్ సిగ్నల్. ఇలా నగరంలో నిత్యం రద్దీగా ఉండే పాయింట్లు వీరిని బెగ్గింగ్ కోసం సిద్ధం చేశాడు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వీరందరి చేత బెగ్గింగ్ చేయించాడు. నగర వ్యాప్తంగా అనిల్ పవర్ గ్యాంగ్లో సుమారుగా 200 మంది వరకు యాచకులు ఉండొచ్చు అంటూ పోలీసుల అంచనా.

రోజంతా కష్టపడిన యాచకులకు అనిల్ పవార్ ఇచ్చేది కూడా అంతంత మాత్రమే. ఒక్కో యాచకుడు రోజుకి 2000 రూపాయల వరకు సంపాదిస్తే అందులో బిక్షమెత్తుకుని వచ్చిన వాళ్లకు అనిల్ పవర్ ఇచ్చేది కేవలం 200 రూపాయలు మాత్రమే. అంటే రోజంతా ఒక యాచకుడు కష్టపడి యాచిస్తే అతనికి దక్కేది కేవలం 200 రూపాయలు మాత్రమే. రోజంతా యాచించి వచ్చిన డబ్బులను 11 గంటల లోపు అనిల్ పవర్ కు అప్పచెప్పేయాలి. తను చెప్పిన ప్రాంతానికి వచ్చి యాచిస్తే వచ్చిన డబ్బంతా ఇచ్చేసి రోజువారి కూలి 200 రూపాయలు పట్టుకొని వెళ్ళాలి. ఇలా ముసలి వాళ్లు అంగవైకల్యం కలవారు వితంతువులు యాచించి తీసుకొచ్చిన డబ్బుతో అనిల్ పవర్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. రోజు రోజుకి హైదరాబాదులో బెగ్గింగ్ సమస్య అధికమవుతుంది. పోలీసులకు ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అసలు ఇంతమంది ఎక్కడినుండి వస్తున్నారు వీరందరినీ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు అన్న విషయాల గురించి ఫోకస్ పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అనిల్ పవార్ ను అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.ఈ మాఫియాలో కేవలం అనిల్ మాత్రమే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు బెగ్గింగ్ మాఫియాను చేదించడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. అమాయకులను యాచకులుగా మారుస్తున్న అనిల్ పవార్ లాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్