34.8 C
New York
Saturday, June 22, 2024

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర, 14 రీల్స్ ప్లస్ ‘టైసన్ నాయుడు’

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర, 14 రీల్స్ ప్లస్ ‘టైసన్ నాయుడు’ కీలక 2 వారాల షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ప్రామెసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రివిల్ చేసిన ఈ సినిమా టైటిల్ ‘టైసన్ నాయుడు’ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, మేకర్స్ రాజస్థాన్‌లో సినిమాకు కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను ప్రారంభించారు. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటలలో పది రాత్రులు సినిమాకు సంబంధించిన బ్రెత్ టేకింగ్ యాక్షన్ బ్లాక్‌ను టీమ్ షూట్ చేస్తోంది. ఇది సినిమాలో మెయిన్ హైలైట్‌లలో ఒకటి. ఈ 2 వారాల లెన్తీ షెడ్యూల్‌లో మేకర్స్ కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేయనున్నారు. ఈ సబ్జెక్ట్‌పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు.గ్లింప్స్‌లో చూపిన విధంగా, బెల్లంకొండ సినిమాలో మాస్ లుక్‌లో ఉన్నారు. పోలీస్ గా మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నారు సాగర్ కె చంద్ర.టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ముఖేష్ జ్ఞానేష్/అనిత్ డీవోపీ వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ సినిమా యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.
తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!