Sunday, September 8, 2024

మునగ సాగుతో.. మెరుగైన ఉపాధి..!!

- Advertisement -

జిల్లాలో 236 మంది రైతులకు చెందిన 245 ఎకరాల్లో మునగ సాగు
ఉపాధి హామీతో లాభాలు గడిస్తున్న రైతులు
జాబ్ కార్డు ద్వారా 100 రోజుల పనిదినాలు
కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతున్న రైతులు

ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి హామీ అండతో.. వివిధ రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తూ.. పండ్ల తోటల పెంపకంపై మక్కువ చూపుతున్నారు. ఆత్మస్థైర్యంతో అడుగిడుతున్న సన్న , చిన్నకారు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం.. సత్ఫలితాలను ఇస్తోంది. మునగ సాగు ద్వారా.. వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు.. మరికొందరికి ఉపాధి అవకాశాలను కుడా కల్పిస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్దేశం ప్రకారం జాబ్ కార్డు కలిగిన గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పనతో పాటు… వ్యక్తిగత ఉమ్మడి ఆస్తుల ఏర్పాటులో భాగంగా చేపట్టిన పనులు కేటగిరి “బి”కి సంబంధించి.. వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధి చేసేందకు గాను ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనులకు అనుసందానం చేయడమైనది. ఈ పనుల్లో భాగంగా 5 ఎకరాల లోపు భూమి కల్గిన రైతులకు మరియు దుర్బలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతు కుటుంబాలకు మునగ తోటల పెంపకం చేపట్టి సుస్థిర ఆదాయ మార్గాల ద్వారా వారు జీవనోపాధి పొందుటకు ఈ పథకాన్ని వర్తింప చేయడం జరుగుతుంది.
లాభాలబాటలో మునగసాగు
2023 – 2024 ఆర్థిక సంత్సరానికి జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం క్రింద 236 మంది రైతులు, 245 ఎకరాల్లో మునగ తోటలు సాగు చేస్తున్నారు.
వ్యవసాయ పంటలకంటే ఉద్యాన పంటల్లో సాగు పెట్టుబడులు, యాజమాన్య ఖర్చులు తక్కువ కావడంతో.. రైతులు కూడా అమితంగా ఆసక్తి చూపుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందిస్తున్న ఉపాధి పనులు, రాయితీలు రైతులకు మరింత లాభదాయకంగా మారాయి. దీంతో గ్రామీణ రైతులు, రైతు కూలీలు ఉపాధి హామీ పథకంలో అనుసంధానం చేయబడిన ఉద్యాన పంటల సాగుకు మొగ్గుచూపుతూ.. ఉన్న ఊరులోనే చక్కటి ఉపాధి పొందుతున్నారు.

Better employment with sugarcane cultivation..
Better employment with sugarcane cultivation..

మునగ సాగుతో.. రైతు ముందంజ

ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామం జాబ్ కార్డు హోల్డర్ రైతు కే. వెంకటేశ్వర్లు, నేను ఉల్లి, కంది, శనగ, పంటలు సాగు చేసి దిగుబడులు కూడా సరిగా రాక నష్టాలు చవిచూసే వాళ్లమని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఉపాధి హామీ పథకం అధికారుల సూచనలు సలహాల మేరకు ఈ ఏడాది ఒక ఎకరా పొలంలో ఉపాధి హామీ పథకం సహకారముతో మునగ పంటను సాగు చేశాను, రాజమండ్రి నుంచి PKM.1.అనే రకం మునగ మొక్కలు 440 ఒక ఎకరా విస్తీర్ణములో నాటడం జరిగిందన్నారు. మొక్కలపై ప్రత్యేక దృష్టి పెట్టి శ్రద్ధతో ఎరువులు, మందులు సకాలంలో వేస్తూ నీటిని క్రమము తప్పకుండా పెట్టడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి, 5 నెలలలోనే పంట చేతికి వచ్చింది. మొక్కలు నాటుకొనుటకు ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం అందింది అన్నారు. 30 వేల రూపాయలు ఖర్చు చేసి సస్యరక్షణ మందులను వాడటం చేత పంట విరిగా కాయడంతో అధిక దిగుబడి వస్తుందని అన్నారు. ప్రస్తుతం కేజీ 130 రూపాయల నుండి 150 రూపాయల వరకు ధర పలికి అధిక లాభాలు వచ్చాయన్నారు ఎకరా కు ఖర్చులు పోను దాదా రూ1,50,000/- ఆదాయం వస్తున్నది అన్నారు. ఇలా సహకారం అందిస్తున్న అధికారులకు ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం అంటున్నారు కె వెంకటేశ్వర్లు. మునగ పంట సాగులో తక్కువ ఖర్చులతో అధిక లాభాలు పొందవచ్చు.
కల్లూరు మండలం బస్తిపాడు గ్రామం జాబ్ కార్డ్ హోల్డర్ బి. అయ్యన్న, నాకు ఉన్న పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను కానీ పెట్టుబడులు కూడా సరిగా రాక నష్టపోయాంకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఉపాధి హామీ పథకం అధికారుల సూచనలు సలహాల మేరకు ఈ ఏడాది ఒక ఎకరా పొలంలో ఉపాధి హామీ పథకం సహకారముతో మునగ పంటను సాగు చేశాను, ఒక్క ఎకరా పొలములో 448 మునగ మొక్కలను తెచ్చుకొని నాటుకున్నాను నా పొలం సారవంతంగా ఉండటం చేత మొక్కలు ఏపుగా పెరిగాయి. మొక్కలకు నాణ్యత గల ఎరువులు, మందులు వేయడం చేత చెట్టుకు మునగ కాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఐదు నెలలకే దిగుబడులు వచ్చాయి, కోతకు వచ్చిన పంటను కూలీలచే కోత కోయించి ప్యాకింగ్ చేసుకొని కర్నూల్ మార్కెట్ కు తరలించుకున్న సమయంలో మునగ కాయలు అధిక ధరలు ఉండడం చేత నాకు దాదాపు లక్ష రూపాయలకు పైగాఆదాయం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తూ సలహాలు సూచనలు ఇచ్చిన అధికారులకు ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం అంటున్నారు బి అయ్యన్న.

మునగ సాగుతో.. మెరుగైన ఉపాధి

కర్నూలు మండలం నందనపల్లె గ్రామం జాబ్ కార్డ్ హోల్డర్ కే.ఆంజనేయులు, గతంలో నాకున్న పొలములో ఉల్లి పంట వేశాను. పంటకు పెట్టుబడి ఎక్కువ పంట రాబడి తక్కువగా ఉండటం చేత నష్టం వచ్చి అప్పులు ఎక్కువగా అయినాయి,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఉపాధి హామీ పథకం అధికారుల సూచనలు సలహాల మేరకు ఈ ఏడాది ఒక ఎకరా పొలంలో ఉపాధి హామీ పథకం సహకారముతో మునగ పంటను సాగు చేశాను, మునగ పంట తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుంది. మార్కెట్ లో ఈ పంట పోషకాల పంటగా గుర్తింపు వచ్చినందున మంచి డిమాండ్ ఉంది. నేను వేసిన పంట కూడా చెట్లు ఏపుగా పెరిగి అధిక సంఖ్యలో మునగ కాపు చేతికి వచ్చింది అధిక లాభాలు వచ్చాయి గతంలో చేసిన అప్పులన్నీ తీరాయి, ఇలాంటి సహాయ సహకారాలు అందించిన అధికారులకు, మన ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అంటున్నారు కే అంజనేయులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్