క్రమశిక్షణ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలి
Better results should be achieved through discipline-విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అవసరం..
– సెల్ ఫోన్ కు విద్యార్థులు బానిసలు కావద్దు
– విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ
– వినూత్న పద్ధతిలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులు
– గణిత ఉపాధ్యాయుడు డి .ఈశ్వరయ్య వెల్లడి
నందికొట్కూరు
– విద్యార్థినీ ,విద్యార్థుల విద్య అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు డి .ఈశ్వరయ్య అన్నారు . శనివారం పాఠశాలలో గణిత పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రోత్సాహక బహుమతులు అందజేశారు . ఈ సందర్భంగా డి .ఈశ్వరయ్య మాట్లాడుతూ 2024 సంవత్సరము పాఠశాలలో నిర్వహించిన గణితం ప్రతిభ పోటీ పరీక్షలలో అత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. అంతేగాక విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ ,సమయపాలన అవసరమని, ఇవి అలవరచుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని తెలిపారు.పాఠశాల వదిలిన అనంతరము విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారి ఇంటి వద్ద తల్లిదండ్రుల సమక్షంలో వారికి బహుమతులను ప్రధానం చేయడం జరిగిందన్నారు. క్రమశిక్షణ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడంతోపాటు విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు . అనంతరం పాఠశాల ఇన్చార్జ్ ఉపాధ్యాయుడు రఫీ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు ,సెల్ ఫోన్ లకు బానిసలు కాకుండా గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులదని, విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పాఠశాలను సందర్శించి తెలుసుకోవాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. త్వరలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వినూత్న పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు . ఉపాధ్యాయుల ప్రయత్నం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గణితం పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన జస్వంత్, శ్వేత, ఫాతిమా, అనూష, అంజలి, దేవరాజ్, జయచంద్రుడు, ఆశీర్వాదమ్మ, శివనందిని మొదలగు విద్యార్థులకు గణిత ఉపాధ్యాయుడు మరియు కమిటీ సభ్యుల ద్వారా బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మహమ్మద్ హుస్సేన్ కమిటీ సభ్యులు స్వాములు, శివకుమారి మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




