భక్తులకు మెరుగైన సేవలు అందించాలి!
శ్రీవారి దర్శనం చేసుకున్న పీజేఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు. !!
హైదరాబాద్ /తిరుపతి, జూలై2
(వాయిస్ టుడే రాష్ట్ర ప్రతినిధి వై వి) తిరుమల తిరుపతి దేవస్థానంలో ,గత ప్రభుత్వ హాయంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగిందనే విమర్శలు సర్వత్రా భక్తుల నుండి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మారినా అదే పద్ధతి నేటికీ కొనసాగుతుండటంతో, భక్తులుఅనేకవస్థలు పడుతున్నారు. అలిపిరి మెట్ల నుండి కాలిబాటన వచ్చిన వారికి కూడా టోకెన్లు వేయకపోవడంతో, దర్శనం కోసం వేల కిలోమీటర్ల నుండి వచ్చిన భక్తులు,రోజుల తరబడి ఒంటి కాలుపై,వేసి ఉండాల్సి వస్తుందని, పలువురు భక్తులు వా పోతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లెటర్లు పనిచేయక, భక్తులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులను పరిమితికి మించి ఉంచటంతో, పాలు, భోజన సదుపాయాలు అందక భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. కంపార్ట్మెంట్లో ఎక్కువమంది భక్తులు ఉండటం వలన పడుకోవడానికి వీలు లేకుండా ఉన్నది. రాత్రి వేళల్లో ఒకే చోట కాకుండా రెండు మూడు చోట్ల కంపార్ట్మెంట్లలో బదిలీ చేయడం వలన, నిద్ర హారాలు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఏపీ లో చంద్రబాబు కూటమి అధికారం చేపట్టటంతో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దుష్టి సారిoచారు. కొత్త ఈవోగా సమర్థవంతమైన అధికారిగా పేరు ఉన్న శ్యామలరావును ఎంపిక చేశారు. కొండపైన ప్రైవేట్ వ్యక్తులు, ట్రావెల్స్ వారు,తమ వ్యాపారాల కోసం భక్తులను అదనపు రేట్లు తో నిలువు దోపిడీ చేస్తున్న సంబంధిత అధికారులు పేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు, పాత పద్ధతులే కాకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు, సేవకులు, ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు.