రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరస్థుల తో జాగ్రత్త
Beware of cyber criminals in the wake of loan waivers
అందరికి నమస్కారం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన *రుణమాఫీ* నేపథ్యంలో కొందరు *సైబర్ నేరస్థులు* ఎదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగో తో *వాట్స్ యాప్ లో APK files* పంపిస్తున్నారు. *దీన్ని మనము accept చేస్తే మన వాట్స్ యాప్ వాళ్ళ కంట్రోల్ కీ వెళ్లి పోతుంది, అంతే కాకుండా మన కాంటాక్ట్స్ లో వున్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళ్తున్నది.* దీని ద్వారా *సైబర్ నేరస్థులు మన Google Pay / Phone Pay మరియు UPI ద్వారా డబ్బులు దోచేస్తున్నారు.* ట్రేండింగ్ లో వున్న టాపిక్ ద్వారా APK Files పంపి డబ్బులు కొట్టేస్తున్నారు. కాబట్టి అందరికి మనవి చేసేది ఏమంటే ఏదయినా apk files వస్తే మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదు. మీ వాట్స్ యాప్ పనిచేయకుంటే వెంటనే రిఇంస్టాల్ చేసి report ఆప్షన్ లో రిపోర్ట్ చెయ్యండి. ఎవరైనా ఏదయినా నేరానికి గురి అయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా #1930 కీ కాల్ చెయ్యండి లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చెయ్యండి. — నూకల వేణు గోపాల్ రెడ్డి, DSP సైబర్ సెక్యూరిటీ బ్యూరో.


