18.5 C
New York
Tuesday, April 16, 2024

భగత్ సింగ్ పేరు వింటే భారతీయులందరీ హృదయాలు ఉత్తేజితం అవుతాయి

- Advertisement -

. బ్రిటిష్ వారి బానిసత్వం నుండి భారత విముక్తికై 23 సంవత్సరాల వయస్సులోనే ఉరికంబాన్ని ఎక్కి దేశం కోసం స్వేచ్ఛ కోసం తన యవ్వన కాలాన్ని జీవితాన్నీ పణంగా పెట్టిన వీర యోధుడు.
ఒక మామూలు రైతు కుటుంబం లో 1907 సెప్టెంబర్ 28 పంజాబ్ రాష్ట్రం బంగా గ్రామం లో జన్మించాడు.1931 మార్చ్ 23 న లాహోర్ జైళ్లో విప్లవం వర్ధిల్లాలి, స్వాతంత్య్రం కావాలంటూ ఉరికొయ్యలను ముద్దాడుతూ తన ప్రాణాలను అర్పించాడు.
యువతలో విప్లవ స్ఫూర్తిని నింపేందుకు 1920లో నవ జవాన్ భారత సభ (యువకుల సెమీ మిలటరీ) సంస్థ ను స్థాపించారు. సోషలిస్టు దేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్వేచ్ఛను సాధించడం ఈ సంస్థ ఉద్దేశం. సుఖ్ దేవ్ చంద్ర శేఖర్ ఆజాద్ బికే దత్ వంటి తీవ్ర వాదులతో కలిసి పని చేశారు.1919 జలియన్ వాలా బాగ్ ఊచ కోత జరుగుతున్నపుడు అతనికి 12ఏళ్లు. 13 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాల్లోకి దూకాడు. దేశానికి పట్టుగొమ్మలు మీరే నిద్రిస్తున్న సింహల్లార లేవండి నిజమైన శక్తి మీరే అంటూ యువతను ఉత్తేజపరిచిన ధీరోత్తారుడు భగత్ సింగ్.
అది 1928 సైమన్ కమీషన్ రాకను నిరసిస్తూ లాలా లజపతి రాయ్ నాయకత్వం లో శాంతి యుత నిరసన జరుగుతుండగా జేమ్స్ స్కాట్ అనే యువ పోలీస్ అధికారి విచక్షణా రహితంగా నిరసన కారులపై లాఠీ ఛార్జ్ చేయడం తో అందులో లాలలాజపతి రాయ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.దీనికి ప్రతీకారంగ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్,చంద్ర శేఖర్ ఆజాద్ లతో కలిసి 1928 డిసెంబర్ లాహోర్ లో పోలీస్ స్టేషన్ దగ్గర జాన్ సాండర్స్ అనే యువ పోలీస్ అధికారిని చూసి అతనే జేమ్స్ స్కాట్ అనుకొనీ పొరపాటున బుల్లెట్టు దింపి కాల్చారు. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ రాజ్ గురు లు 5నెలల పాటు తప్పించుకున్నారు. అదే తరుణంలో బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాల మీద ప్రజల దృష్టిని మరల్చడానికి పార్ల మెంటు సెంట్రల్ హాల్ పై అనుచరుడు బటుకేశ్వర్ దత్ తో కలిసి బాంబులు పేల్చారు.
ప్రజల గొంతును నొక్కెందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ప్రజా గొంతు వినిపించేందుకు ఆ పని చేశానని చెప్పుతూ ఆ సమయంలో లో పారి పోకుండా అక్కడే నిలబడి పోలీసులకు దైర్యం గా లొంగిపోయాడు.
సాండర్స్ హత్య వ్యూహ రచన లో భాగమైన సుఖ్ దేవ్ రాజ్ గురు లకు కోర్టు ఉరి శిక్ష వేయాలని నిర్ణయించింది.అది తెలిసిన మరుక్షణం దేశం అంతా ధర్నాలు, మహ సభ లు దేవుని ప్రార్థనలు.. జరుగుతున్నాయి.లండన్ ప్రీవి కౌన్సిల్ క్షమా బిక్షను తిరస్కరించడం తో ఉరి శిక్ష విధించబడింది . ఉరిశిక్షకు ముందు భగత్ సింగ్ తో తన తల్లి నీ వంటి బిడ్డను కన్నందుకు గర్వపడుతున్నాను రా మరణం ఎవరి కైన తప్పదు కానీ ప్రపంచం మొత్తం నీ త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటుంది అని.

చిరునవ్వుతో ఊరికంబాన్ని స్వీకరిస్తూ “ఇంక్విలాబ్ జిందాబాద్ “విప్లవం వర్ధిల్లాలి ” అంటూ ఉరి కొయ్యలను ముద్దాడుతూ ముగ్గురు విప్లవ వీరులు చిరస్మరణీయ వీరులుగా యావత్ భారతీయులందరి హృదయాల్లో నిలిచిపోయారు.
ఇలాంటి గొప్ప వీరుల్ని కన్న భూమి మనది
మనం చదివే చదువులు దోపిడీ లేని సమాజాన్ని, కూడు, గూడు, గుడ్డ అందించే నూతన భారతాన్ని నిర్మించి పేదొల్ల కన్నీళ్లు తుడిచే విధంగా ఉండాలని భగత్ సింగ్ అన్నారు. కానీ మన నేటి యువత పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను అని మార్కులు రాలేదని కృంగి పోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమించలేదని, ప్రేమిస్తావా లేదంటూ ఉన్మాదానికి కి పాల్పడుతున్నారు. భగత్ సింగ్ చెప్పిన మాట పరాజయాలకు తలవంచి ఆగిపోతే మనం ప్రయాణించే మార్గం మూసుకుపోతుంది. దారిలో అడ్డంకులను తొలగించడానికి వేసే ముందడుకు బదులు మనమే ఇతరులకు అడ్డంకిగా గ మారతాం.
ఒక నాడు భగత్ సింగ్ తన స్నేహితునితో ప్రేమ గురించి చెప్తూ.. ప్రేమ మనిషిని ఉన్నతీకరిస్తుందే తప్ప దిగజార్చదని ప్రేమ జంతు ప్రవృత్తిని కలిగి ఉండరాదని అన్నారు.
మన యువత చిన్న చిన్న విషయాలకు, పరాజయలకు, కృంగియి ఆత్మ హత్యలు చేసుకొని మనని కన్న కుటుంబానికి కన్నీటి శోకాన్ని మిగల్చరాదు. ఆత్మ హత్యలు చేసుకోవడం పిరికి పందల చర్య అన్న భగత్ సింగ్ మాటలను గుర్తు చేసుకోవాలి. “నిద్రిస్తున్న సింహల్లారా లేవండి దేశానికి పట్టుగొమ్మలు మీరే నిజమైన శక్తి మీరే” అన్న భగత్ సింగ్ మాటలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్ళ వలసిన అవసరం ముంది.

 

 

ముండల విలాస్
వ్యక్తిత్వ వికాస శిక్షకులు (మోటివేషనల్ ట్రైనర్) అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్
నిర్మల్

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!