*భగ్గుమన్న బీఆర్‌ఎస్.. కేసీఆర్ పై ‘సిట్’ వేధింపులకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దహనం!

- Advertisement -

*భగ్గుమన్న బీఆర్‌ఎస్..

కేసీఆర్ పై ‘సిట్’ వేధింపులకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దహనం!

వాయిస్ టుడే :ఫిబ్రవరి 2 ,

*Bhaggumanna BRS..

CM’s effigy burned in protest against ‘SIT’ harassment of KCR!

కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత, కేసీఆర్ పై సిట్ (SIT) విచారణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఉగ్రరూపం దాల్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడుతూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తండా సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. “సిట్ విచారణలు ఆపాలి – కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి” అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు చేసిన నినాదాలతో గోవిందరావుపేట తండా హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్ మాట్లాడుతూ.. “ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం చేతగాక, ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ గారిపై సిట్ అధికారులతో నోటీసులు ఇప్పిస్తూ వేధిస్తున్నారని” ధ్వజమెత్తారు. విచారణల పేరుతో సమయం వృథా చేయకుండా, రైతులకు రుణమాఫీ, మహిళలకు మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు గంగా నాయక్ మాజీ సర్పంచ్ జగన్ తదితర బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular