అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు
Bhakta Kanakadasa idol set up in Amaravati
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
గుంతకల్లులో కనకదాసు కాంస్య విగ్రహ ఆవిష్కరించిన మంత్రి
తిరుపతిలో కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి
టీడీపీతోనే కురబలకు రాజకీయ ప్రాధాన్యం
మంత్రి
గుంతకల్లు
అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత తెలిపారు. తిరుపతిలోనూ భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గుంతకల్లు పట్టణంలో భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతులపైనా, కుల వ్యవస్థపైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాస చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. అటువంటి మహానీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. కనకదాస వారసులవ్వడం కురబలు చేసుకున్న అదృష్టమన్నారు మాట ఇస్తే మాట తప్పని నైజం కురబలదన్నారు. ఒకప్పుడు పాలకులుగా వెలిగిన కురబలు ఆర్థిక నిర్వహణలోనూ నిష్ణాతులన్నారు. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్రవేస్తున్న కురబలు విద్యాపరంగానూ ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. కురబ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు మంజూరుచేయనున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె కోరారు.
టీడీపీతోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం
కురవల రాజకీయ అభివృద్ధికి ఆవిర్భాం నుంచి టీడీపీ ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. గతంలో అన్న ఎన్టీఆర్, ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు కురబలకు అండగా ఉంటూ వస్తున్నారన్నారు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎంపీ టిక్కెట్లు, ఒక ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు మంత్రి వర్గంలో కూడా స్థానం కల్పించారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్లులో కురబలకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే గుమ్మన జయరామ్ కు మంత్రి సవిత కోరారు.
అమరావతిలో కనకదాస విగ్రహం
అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబునాయుడు కలిసి అమరావతిలో భక్త కనకదాస విగ్రహానికి స్థలం కేటాయించాలని కోరగా, అందుకు ఆయన అంగీకారం తెలిపారన్నారు. తిరుపతిలో కనకదాస పీఠం ఏర్పాటుకు పీఠాధిపతి నుంచి అనుమతి తీసుకుంటే, స్థలం మంజూరు చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అంతకుముందు కనకదాస విగ్రహాష్కరణ కార్యక్రమాన్ని మంత్రి సవిత జ్యోతి ప్రజల్వనచేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, సీపీఐ నాయకులు జగదీష్, రాష్ట్ర, జిల్లా కురుబ సంఘం నాయకులు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.