Thursday, April 24, 2025

పెద్ది…పై భారీ ఆశలు

- Advertisement -

పెద్ది…పై భారీ ఆశలు
హైదరాబాద్, ఏప్రిల్ 8, (వాయిస్ టుడే )

Big hopes for Peddi...

సినిమా ఇండస్ట్రీలోకి వారసులుగా వచ్చి రాణించడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు ఉన్న స్టార్ డమ్ ని మోస్తూ ఇప్పుడున్న ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలను చేయడం అనేది చాలా పెద్ద బాధ్యత…దానిని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తే పర్లేదు. కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా వాళ్ల కెరియర్ తో పాటు చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఆ ఫ్యామిలీ పేరు కూడా చెడిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక స్టైల్ అయితే ఉంటుంది. ఇక దాంతోనే ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటూ వాళ్ళను తమ అభిమానులుగా మార్చుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి సినిమా సక్సెస్ అయ్యింది అంటే అందులో హీరో గొప్పతనం ఎంతగా ఉంటుందో దర్శకుడు యొక్క గొప్పతనం కూడా అంతే ఉంటుంది… ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి  సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తన డాన్స్ తో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు… ఇక చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆయన ఎంటైర్ కెరీయర్ లో ఇప్పటివరకు రెండు భారీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లను సాధించాడు. చాలా తక్కువ కెరియర్ లోనే రెండు ఇండస్ట్రీ హిట్స్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అంతలోనే రెండు ఇండస్ట్రీ హిట్స్ సాధించాడు అంటే మామూలు విషయం అయితే కాదు.రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ సాధించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. మరి ఇప్పుడు ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’  సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో రామ్ చరణ్ తన మార్కును చూపిస్తూ మరోసారి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా ఒక మాస్ అవతారంలో కనిపించబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఎప్పుడైతే ఈ గ్లింప్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి రామ్ చరణ్ పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా బాగా ప్లస్ అవ్వబోతున్నాయనేది కూడా అర్థమవుతుంది. రామ్ చరణ్ లాంటి నటుడు తన పరిపూర్ణమైన నటనను చూపించాలంటే అతనికి అంతే డెప్త్ తో ఉన్న క్యారెక్టర్ అయితే పడాలి. ఇక ‘రంగస్థలం’  సినిమాలో అలాంటి క్యారెక్టర్ పడింది కాబట్టే అతనిలోని నటన ఎలివేట్ అయిందిఇక దాంతో పాటుగా త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా సీతారామరాజు పాత్రని పోషించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఆ రెండు సినిమాల తర్వాత ఈ సినిమాలో కూడా తననట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇదంతా చూసిన సినిమా మేధావులు సైతం ‘పెద్ది’ రామ్ చరణ్ కి పర్ఫెక్ట్ మూవీ అవ్వబోతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్