- Advertisement -
పుష్ప రాజ్ కు బిగ్ రిలీఫ్
Big relief for Pushpa Raj
హైదరాబాద్
అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో పుష్ప రాజ్ కి హైకోర్టులో కాస్త ఊరట లభించింది.సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఏ11 నిందితుడిగా అల్లు అర్జున్ వున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అయనను పోలీసులు అరెస్టు చేసారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యూలర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా ఆదేశించింది.
- Advertisement -