- Advertisement -
వేములవాడ బిజెపి అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు
వేములవాడ: వేములవాడ బీజేపీ అభ్యర్ది చివరి నిమిషంలో మారారు. ముందుగా ప్రకటించిన తుల ఉమ కు బదులు బిజెపి అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు ను ఖరారు చేసారు. శుక్రవారం నాడుఅయన నామినేషన్ దాఖలు చేసారు. మాజీ మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు కుమారుడు వికాస్ రావు. చెన్నమనేని వికాస్ రావు పేరిట బిజెపి బీఫామ్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బిజెపి నాయకులు అందచేసారు. అభ్యర్ది మార్పుపై తుల ఉమ స్పందించారు. బీసీ ప్రజల తరుపున నిత్యం పోరాడే మనిషిని నేను. ఎన్నికలకోసం యూఎస్ నుంచి వచ్చిన వెలమ దొర వికాస్ రావు. ఇతను మాజి కేంద్ర మంత్రి మాజి గవర్నర్ విద్యాసాగర్ కుమారుడు. చివరికి వారసత్వమే గెలిచింది. కమలం ఓడింది వాడిందని అన్నారు

- Advertisement -



