3.5 C
New York
Monday, February 26, 2024

మిమ్మల్ని పెద్దసార్‌ …. రమ్మంటున్నారు

- Advertisement -

సీఎం టేబుల్‌పై ఎమ్మెల్యే టోటల్‌ పిక్చర్‌..

ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూపిస్తూ ఎమ్మెల్యేలకు క్లాసులు..!

Big you... coming
Big you… coming

హైదరాబాద్, ఆగస్టు 14:  ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రతిపక్షాలు ఊపుమీదున్నాయి. రోజుకో అప్‌డేట్‌తో కాక రేపుతున్నాయి. మరి అధికార పార్టీలోని బిగ్‌బాస్‌కు ఎలా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షాలకు అంతకుమించి చుక్కలు చూపించడం కూడా అంతే ముఖ్యం..ఈ ముక్క కేసీఆర్‌కు తెలియంది కాదు.. ఎందుకంటే ఆయన మార్క్‌ పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో.. ఊహించలేం.. కాకపోతే ఎంత పెద్ద లీడరైనా..సైన్యం స్ట్రాంగ్‌గా లేకపోతే.. యుద్ధం చేయడం కష్టం.. ఇది కూడా పెద్దాయనకు బాగా తెలుసు.. అందుకే.. ఎలెక్షన్‌ రేటింగ్‌ రేసును బట్టి ఎమ్మెల్యేలను పిలిచి..ప్రోగ్రెస్‌ రిపోర్టు ముందు పెట్టి మరీ క్లాసు పీకుతున్నారట పెద్దసార్‌.. గతం గతః..ఇప్పుడు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందేనని.. గులాబీ బాస్ నుంచి క్లాస్‌ చెప్పించుకున్న వాళ్లు వేరేవారికి సలహాలు ఇస్తూ మొరపెట్టుకుంటున్నారట.. వంద రోజుల్లో ఎన్నికల నొటిఫికేషన్‌ రాబోతోంది.. ప్రతిపక్షాల నేతల కంటే.. బీఆర్ఎస్‌ నాయకులకు ఇది చాలా క్లిష్టమైన సమయం.. ఎందుకంటే.. అధికార పార్టీ అనగానే.. అంతటా ఆసక్తికంగా ఉంటుంది. ఈ క్రమంలో కొంత వ్యతిరేకత, సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఉండటం అనేది సహజం. పథకాల అమలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇలా అన్నింటిని సరిచూసుకోవాల్సిన సమయం. ఎవరినీ కాదనలేరు.. అక్కున చేర్చుకోలేరు.. ఇలాంటి సమయంలోనే

Big you... coming
Big you… coming

ప్రగతి భవన్‌ నుంచి ఫోన్‌ వస్తుంది..అందులో వచ్చే ఓ వాయిస్‌ నుంచి..మిమ్మల్ని పెద్దసార్‌ రమ్మంటున్నారని డేటు, టైమ్‌ వస్తాయి.. ఈ మాట వినేసరికి ఇవతలి వాళ్లకు..పెద్దసార్‌ దగ్గర జరిగేది కళ్ల ముందు ఐమాక్స్‌లో కనిపిస్తుంది.. ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి పిలుస్తున్నారు సీఎం కేసీఆర్.ముందుగా ముఖ్యమంత్రే పిలిచారంటే మామూలు విషయం కాదు..మనలో అంతో ఇంతో విషయం లేకపోతే పెద్దాయన పిలుస్తారా అని చంకలు గుద్దుకుంటూ ప్రగతి భవన్‌కు దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు.. అక్కడ జరుగుతున్న వ్యవహారం.. ఆనోట ఈ నోట బయటకొచ్చిన సంగతి తెలుసుకుని జంకుతున్నారట.. పిలుపొస్తే దడ పుడుతోందట.. మొదటినుంచి సర్వేలతో ప్రజల నాడీ తెలుసుకునే కేసీఆర్ ఇప్పుడు కూడా గత ఆరు నెలలుగా మూడు సర్వేలు చేయించారు. అవి కూడా వివిధ సర్వే ఏజెన్సీల నుంచి.

ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా… ఆయన కలవడానికి వచ్చిన ప్రజల్ని రిసీవ్ చేసుకుంటున్నారా? అసలు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉంటున్నారు. ఇచ్చిన హామీలు ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు జరిగాయి. దీంతోపాటు ఎక్కడైనా భూ వివాదాల్లోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ తల దూర్చారా అనే విషయాలు కూడా తెప్పించుకుంటున్నారు ముఖ్యమంత్రి.. సర్వే ఫలితాలతో పాటు ఇంటెలిజెంట్ సమాచారం కూడా ముందు పెట్టుకుని ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ పిలుస్తున్నారు.పిల్లాడి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ పట్టుకుని..వచ్చిన మార్కులను బట్టి తండ్రులు స్పెషల్‌ క్లాసులు ఎలా పీకుతారో అందరికీ తెలిసిందే. ఇక్కడా అదే సీన్‌..కాకపోతే.. ఇక్కడ ఎమ్మెల్యేలు..అక్కడ ముఖ్యమంత్రి.. ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం ముందు పెట్టి క్లాస్ పీకుతున్నారట గులాబీ బాస్… ఇది చివరి అవకాశం మారకపోతే నీ వెనకాల టికెట్ కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు జాగ్రత్త అంటూ కొంతమందికి హెచ్చరికలు కూడా వెళ్లాయట. ఇప్పటికే 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్లో అపాయింట్మెంట్లు అయిపోయాయి. మిగతా వారిలో తమ బండారం, భవిష్యత్తు పెద్ద సార్ దగ్గర ఏముందో..ఏమంటారో అనే ఆందోళన మొదలైంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ వస్తుందా.. రాదా అనే ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు.. కుటుంబ సభ్యులందరితో సహా ప్రగతి భవన్‌ వచ్చి పెద్దసార్‌ కాళ్ళమీద పడిపోతున్నారట.. ఏదో తెలియక తప్పు జరిగిందని.. టిక్కెట్ మాత్రం కాదనకండి అంటూ మోకరిల్లుతున్నట్లు టాక్ నడుస్తోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!