Sunday, September 8, 2024

బీజేపీ,బిఅర్ఆర్ ఇద్దరు ఒక్కటే…

- Advertisement -
BJP and BRR are one…

– అబద్ధాల మోడీ,కెసిఅర్ ను తెలంగాణ ప్రజలు నమ్మరు …
– కేసీఆర్ ఒక్కసారి కర్ణాటకకు వస్తే కర్ణాటకలో 5 గ్యారెంటీ పథకాలు చుపిస్తా…
కర్ణాటక సీఎం.సిద్ధరామయ్య…
– తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం..
– కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని, ఈ అవకాశంతో కేసీఆర్ ను ఓడించాలి…
– మేడిగడ్డ ఎలా కూలిందో కేసీఆర్ సర్కార్ అలాగే కదులుతుంది…
– గజ్వేల్ ఓటమి భయంతో కామారెడ్డి కి కెసిఅర్ ..
– కెసిర్ కు సీబీఐ ఈడి విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి…
కామారెడ్డి బ్యూరో నవంబర్ 10 వాయిస్ టుడే;
నరేంద్ర మోడీ వంద సార్లు తెలంగాణకు వచ్చిన బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావని,
అబద్ధాల మోడీని ప్రజలు విశ్వసించరని
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో పిసిసి అధ్యక్షుడు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కామారెడ్డి లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం. ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన బీసీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక సీఎం మాట్లాడుతూ, నరేంద్రమోడీ దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఎత్తులు వేసిన గెలవలేక పోయిందన్నారు.బీజేపీ పై పలు ఆరోపణలు చేశారు. బీజేపీ, సీఎం కేసీఆర్ ఇద్దరు ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేసింది ఏమిలేదని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకపోయిందన్నారు. కొడంగల్ , కామారెడ్డిలో రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు.
కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామన్న భరోసాతో ఉన్నారన్నారు. 30వ తేదీ కేసీఆర్ ను ఓడగొట్టేందుకు ప్రజలు చూస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,
బిజెపి నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలువదన్నారు. మోడీ కర్ణాటకలో 40 సార్లు ఎన్నికల ప్రచారం చేసినా ఓడిపోయారన్నారని, కర్ణాటకలో మోడీ మీద నమ్మకం పెట్టుకుని ఎన్నికల్లో బరిలోకి దిగారు అయినా ఓడిపోయారన్నారు.
నా రాజకీయ జీవితంలో ప్రధాని మోడీ ఆడిన అబద్దాలు ఎవరూ ఆడలేదని మరోసారి అన్నారు.
మోడీ ప్రధాని అయ్యాక ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, దళితులకు, బిసిలకు, పేదలకు నరేంద్ర మోడీ చేసింది ఏమి లేదని,
కర్ణాటకలో 5 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెడితే…బీజేపీ వ్యతిరేకించిందన్నారు.
అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో చెప్పిన 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అన్నారు.
కర్ణాటకలో గ్యారెంటీ పథకాలు అమలుకావట్లేదని కేసీఆర్ అన్నాడు. ఒక్కసారి కర్ణాటకకు వస్తే తెలుస్తోందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నారు. మోడీ, కేసీఆర్ అబద్దాలను ప్రజలు నమ్మవద్దని
బిసిలకు, దళితులకు, అల్ప సంఖ్యాకులకు న్యాయం చేసేది కాంగ్రెస్ అన్నారు.
బిఆరెస్, బిజెపీకి బీ పార్టీలన్నారు.
ఎన్నికల్లో బీజేపీ, బిఆరెస్ ను తెరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.
మేడిగడ్డ ఎలా కూలిందో కేసీఆర్ సర్కార్ అలాగే కులుతుందని అన్నారు.
టీజేఎస్ అధినేత కోదండరాం మాట్లాడుతూ
మేడిగడ్డ ఎలా కూలిందో కేసీఆర్ సర్కార్ అలాగే కులుతుందని
టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. బీసీ డిక్లరేషన్ సభలో ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి పోరాటాల గడ్డ అని, కామారెడ్డి లో తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ కిష్టయ్య, కరీం ప్రాణాలు త్యాగాలు చేసారని గుర్తు చేశారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని, ఈ అవకాశంతో కేసీఆర్ ను ఓడించాలన్నారు. పల్లవి ఉద్యోగం రాదన్న బెంగతో ఆత్మ హత్య చేసుకుంటే, ప్రేమ విఫలం అయి ఆత్మ హత్యకు పాల్పడినట్లు కేసిఆర్ సర్కార్ సృష్టించడం బట్టి ఆయన దుర్మార్గం బయట పడిందన్నారు. కేసీఆర్ ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీపీసీసీ నాయకులు హన్మంతరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ నిర్ణయిస్తారన్నారు. రేవంత్ రెడ్డి ని కామారెడ్డి నుండి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. సభలో బీసీ డిక్లరేషన్ టీపీసీసీ కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ చదవి సభకు వినిపించారు.దమ్ముంటే ఈ విషయంలో ఇద్దరిపై సీబీఐ ఈడి విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటిల పథకం అమలు
కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తెలంగాణలో రాజకీయాలను అమ్ముడు సరుకు చేసింది కేసీఆర్ అని,
దమ్ముంటే ఈ విషయంలో తనపై, కేసీఆర్ పై సీబీఐ-ఈడి విచారణకు సిద్ధం కావాలని కామారెడ్డి అభ్యర్థి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ స్థానం నుండి హెలికాఫ్టర్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటిల పథకం అమలు చేస్తాం అన్నారు. కామారెడ్డి ప్రజలకు కేసీఆర్ కు చరమగీతం పాడించే అవకాశం వచ్చిందన్నారు. తనపై కక్షతో 2016 తనకు జైలుకు పంపించారన్నారు. కామారెడ్డి కి చెందిన లింబయ్య అనే రైతు పంటకు చేసిన అప్పు తీర్చలేక హైదరాబాద్ వెళ్లి నైట్ వాచ్ మెన్ పనిలో చేరడని, అయిన అప్పులు తీరక న్యాయం చేస్తారని టిఆర్ఎస్ నాయకులు, ఎమ్యెల్యేలు, మంత్రులను, చివరకు సీఎం ను కలవాలని చేసిన ప్రయత్నం విఫలం కావడంతో సచివాలయం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు ఊరు వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడని అన్నారు. కేసీఆర్ స్పందించక పొగ తన భార్యతో గొడవపడి ఆత్మ హత్య చేసుకున్నట్లు చిత్రీకరించిన ఘనత కేసీఆర్ అన్నారు. మాచారెడ్డి లో రైతు బీరయ్య అనే రైతు పంట కుప్పపై అర్ధరాత్రి గుండెపోటుతో మరణిస్తే కనీసం పలకరించని కేసీఆర్ కు కామారెడ్డిపై ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చింది అనుకుంటే తప్పే, గజ్వేల్ ఓటమి భయంతో పాటు, కామారెడ్డి పచ్చని భూములపై కన్నేసి కామారెడ్డి నుండి పోటీకి వచ్చదన్నారు. గతంలో పనిచేసిన సీఎం లు ప్రతి రోజు రైతులు ప్రజల కోసం 3నుండి 5గంటవరకు సమయం ఇచ్చి కష్టాలు తెలుసుకునే వారని, కానీ సచివాలయానికి రాకుండా కేవలం ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో అనేక మంది రైతులకు న్యాయం దొరక్క అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తల్లికి పుట్టిన బిడ్డవే అయితే, రైతు బిడ్డలు ఉరి వేసుకుంటే పట్టించుకోలేదు కానీ ఈరోజు కామారెడ్డి గుర్తొచ్చిందా అన్నారు. కామారెడ్డి సభలో కామారెడ్డి ని బంగారు తునక చేస్తా అని చెప్పిన కేసీఆర్ కామారెడ్డిని బంగారు తునక కాదు, తుప్పు పట్టిస్తాడన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పొట్టకొట్టి, గజ్వేల్ నుండి పారిపోయి కామారెడ్డి వచ్చిన సన్నాసి కేసీఆర్ అని అన్నారు. అమ్మకు అన్నం పెట్టానోడు చిన్నమకు బంగారం పెడ్తాడా అని ఎద్దేవా చేశాదు. కామారెడ్డి చుట్టు ముట్టు అందమైన పచ్చని పొలాలపై కేసీఆర్ కన్ను పడిందన్నారు. మాస్టర్ ప్లాన్ ను అప్పుడు అమలుకు సిద్ధమై ఓట్ల కోసం కొడుకు కేటీఆర్ ను పంపి మాస్టర్ ప్లాన్ రద్దు అయిందని చెప్పించా డన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ కోరిక మేరకు ఏఐసిసి అదేశంతో తను కామారెడ్డి నుండి పోటీ చేస్తున్న అన్నారు. కేసీఆర్ పై పోటీకి తను సిద్ధంగా ఉంది కేసీఆర్ అవినీతి అంతానికి చర్మ గీతం పడాలంటే తను కేసీఆర్ పై పోటీ చేయలని కూడా అనుకున్న అన్నారు. కామారెడ్డి ఎమ్యెల్యే గంపగోవర్ధన్ తన టికెట్ పోయిందని యేడ్చి, మొఖం కడుక్కొని కేసీఆర్ సభకు వెళ్లాడని అన్నారు. ఓ బిసి అయిన గంపను కేసీఆర్ గంప కింద కప్పడని, కామారెడ్డి ప్రజలు చాలా ఉషారుగా ఉంటారని, కేసీఆర్ కామారెడ్డి ప్రజలను గంప కింద కప్పాలంటే సాధ్యం కాదన్నారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు అడుగడునా అన్యాయం చేశారని, ఉద్యోగాల నియామకలు ఏమయ్యాయి అందరికి తెలుసన్నారు. తెలంగాణలో 3వ సారి గెలిపించాలంటే ఎం చేసావు కేసీఆర్ అన్నారు. 50లక్షలు ఇస్తూ పట్టుబడ్డాడు అన్న కేసీఆర్ కాంగ్రెస్, టిడిపి, బీఎస్పీ, సీపీఐ ,వైసీపీ ల నుండి ఎమ్యెల్యేలు, జడ్పిటిసిలు, సర్పంచాలను కొన్న ఘనత కేసీఆర్ దే కదా అన్నారు. లక్షకోట్లు, గజ్వేల్ 1000ఎకరాల్లో కబ్జా, ఎర్రవెళ్లిలో 1000ఎకరాల్లో రల్లో ఫామ్ హౌస్, కాళేశ్వరం నిర్మాణంలో లక్షల కోట్లు, పరీక్షల లీకులు, రైతుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ ను ప్రజల ఇంకా మూడో సారి ఎలా గెలిపిస్తారన్నారు. 10ఏండ్లు అల్లుడు, కొడుకు, కూతురుకు మంత్రి పదవులు, ఇప్పుడు మనవడికి మినిస్టర్ చేసేందుకు కేసీఆర్ తహ తహ లాడుతుందన్నారు. 30లక్షల మంది నిరుద్యోగుల పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణను ఆస్తుల సంపాదనకు కేసీఆర్ వదుకున్నారని, నిరుద్యోగుల గోషా అక్కరలేదు, రైతుల గోశ అక్కర్లేదు అన్నారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ పొగరు వంచాలన్నారు. ఎల్లారెడ్డి ఎమ్యెల్యేగా సురేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచాడు, గోవర్ధన్ టిడిపి నుండి గెలిస్తే వీరిని కొన్నది కేసీఆర్ కదా, ఈ విషయం ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కామారెడ్డి జిల్లాలో 3లక్షల 60వేల ఎకరాలకు సాగు నీరు. అందించి, ప్రతి ఏడాది 2లక్షల ఉద్యోగా నియామకాలు, 12శాతం రిజర్వేషన్ మైనార్టీ డిక్లరేషన్, 500రూపాయలకే సిలిండర్, 4వేలల పింఛన్, ఇందిరమ్మ ఇంటికి 5లక్షలు, 24గంటల ఉచిత విద్యుత్. పేదలకు 200యూనిట్ ఉచిత విద్యుత్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం ఆనందంగా ఉందన్నారు. సభకు హజరైనా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, కర్ణాటక హోంమంత్రికి పరమేశ్వర గంగాధరయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు హన్మంతరావు, మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్, పొన్నం ప్రభాకర్, ఈరవత్రి అనిల్, కె.మహేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, తహెర్ బిన్ హందాన్, రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ పత్తర్ ఘటి,
డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు, సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ, సీపిఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి లతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్