Sunday, January 25, 2026

బీజేపీ, బీఆర్ఎస్… విలీనమేనా..

- Advertisement -

బీజేపీ, బీఆర్ఎస్…
విలీనమేనా..

BJP, BRS...
Merger?

హైదరాబాద్, ఆగస్టు 29, (వాయిస్ టుడే )
బండి సంజయ్, కేటీఆర్ యాదృచ్ఛికంగానే కలిసి ఉండవచ్చు.. వరద బాధితులను కాపాడాలనే కృత నిశ్చయం వారిద్దరిలోనూ ఉండవచ్చు. అన్నింటికంటే ఎక్కువగా వరదల్లో ఈ బురద రాజకీయం ఎందుకంటూ ఇద్దరు ఒక మెట్టు దిగి ఉండవచ్చు. అంతమాత్రాన అది అక్కడితోనే ఆగిపోదు. ఇప్పుడు అసలే సోషల్ మీడియా కాలం.. చీమ చిట్టుకు మన్నా సరే రకరకాల ప్రచారాలు.. రకరకాల ఊహగానాలు తెరపైకి వస్తాయి. ఆ తర్వాత జరగాల్సిన పని జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల సమాజానికి ఉపయోగం ఉంటుందా.. లేదా.. అనే విషయాలను పక్కన పెడితే జరగాల్సిన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక రకమైన చర్చ నడుస్తోంది.బండి సంజయ్, కేటీఆర్ పరస్పరం తారసపడ్డారు కాబట్టి.. ఇదేది యాదృచ్ఛికమైన కలయిక కాదు. వారిద్దరూ అనుకోని కలిశారు. వారిద్దరు మాత్రమే కాదు కమలం, కారు కూడా త్వరలో కలిసిపోతున్నాయి. 2028 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతుంది.. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. అందువల్లే బిజెపి నాయకులు గులాబీ నాయకుల మీద.. గులాబీ నాయకులు బిజెపి నాయకుల మీద విమర్శలు చేయడం లేదని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని.. ఈ తరహా విశ్లేషణలకైతే అడ్డు అదుపు లేకుండా పోతోంది. వీటిని అటు బిజెపి నాయకులు గాని.. ఇటు గులాబీ పార్టీ నాయకులు గాని ఖండించడం లేదు.. దీంతో వీటి వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు.ఇటీవల జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత పలుమార్లు మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రైవేట్ న్యూస్ చానల్స్ లో ముఖాముఖిగా మాట్లాడారు. ఇందులో కారు, కమలం దోస్తీకి సంబంధించిన చర్చ వచ్చింది. గతంలో తాను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చిందని.. దానిని తను అడ్డుకున్నట్టు కవిత ప్రకటించారు. అయితే ఇప్పుడు కవితకు, కల్వకుంట్ల తారక రామారావుకు రాజకీయంగా విభేదాలు ఏర్పడ్డాయి. ఈ అన్నాచెల్లెళ్ల మధ్య అగాధం పూడ్చలేని స్థాయికి చేరుకుంది. దీంతో ఎవరి రాజకీయ భవిష్యత్తును వారు వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తున్నారు..జాతీయ రాజకీయాలను కాస్త పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న చర్చ బిజెపి, కారు పార్టీ కలిసి పోతాయని.. గులాబీ బాస్ కుమార్తె మద్యం వ్యవహారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కమలం, కారు దోస్తీ గురించి చర్చ జరిగిందట. ఒకానొక సందర్భంలో కారు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు.. తన సోదరికి బెయిల్ ఇప్పిస్తే.. ఈ కేసు నుంచి తప్పిస్తే తన పార్టీని కమలంలో విలీనం చేస్తానని మాట కూడా ఇచ్చాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ పార్లమెంట్ సభ్యుడు బయటపెట్టారు.. దానిని గులాబీ పార్టీ నాయకులు ఖండించినప్పటికీ.. అంతర్గతంగా జరిగింది అదే అని చర్చ మొదలైంది. అంతేకాదు ఇటీవల జాగృతి అధినేత్రి కూడా కారు, కమలం దోస్తీ గురించి మాట్లాడారు.. అయితే దానికి తాను ఒప్పుకోలేదని కుండ బద్దలు కొట్టారు.ఈ పరిణామాలు జరగబోయే విలీనానికి సూచికలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాటికి బలం చేకూర్చుతూ కేటీఆర్, బండి సంజయ్ గురువారం పరస్పరం తారసపడ్డారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు.. ఉప్పు నిప్పులాగా ఉండే వీరిద్దరూ పరస్పరం ఎదురు పడటం.. కుశల ప్రశ్నలు వేసుకోవడం ఒకరకంగా చూసేవారికి ఆనందాన్ని కలిగించింది.. అయితే ఈ కలయికను ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవద్దని.. దీని వెనక చాలానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఎందుకంటే తెలంగాణలో పాగా వేయాలని కమలం పార్టీ అనుకుంటున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీకి అనుకున్నంత బలం లేదు. అలాంటప్పుడు కారుతో దోస్తీ కడితే తెలంగాణలో సంయుక్తంగా అధికారం దక్కించుకోవచ్చనేది కమలం పార్టీ ప్లాన్. అయితే ఇది వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభిస్తుంది. కమలంతో దోస్తీకి కేటీఆర్ కూడా సుముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు పార్టీలో పెతనం కూడా కేటీఆర్ దే కావడంతో.. అంతిమంగా ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికైతే ఇలానే సాగుతున్నాయి చర్చలు. భవిష్యత్ కాలంలో ఏ వైపు టర్న్ తీసుకుంటాయి.. ఎలా మారిపోతాయి అనేది చూడాల్సి ఉంది. నాడు కవిత తిరస్కరించింది కాబట్టి.. ఇప్పుడు కమలంతో దోస్తీని తాను నెరవేర్చబోతానని కేటీఆర్ భావిస్తున్నట్టు.. అందులో భాగంగానే కమలం పార్టీతో కలిసిపోతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి.. అయితే ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. కవిత మాట్లాడిన మాటలకు కేటీఆర్ చేస్తున్న చేష్టలు వ్యతిరేకంగానే ఉన్నాయి. రోజులు గడిస్తే గాని ఇటువంటి విషయాలపై క్లారిటీ రాదు.. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు ఉండరు. అలాగే శాశ్వతమైన శత్రువులు కూడా ఉండరు. స్థూలంగా చెప్పాలంటే రాజకీయం అనేది ఒక వైకుంఠపాళీ లాంటిది. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారు అడుగులు వేస్తుంటారు. ఆ అడుగులను వారు సుస్థిరం చేసుకుంటారు. దీనికోసం ఎంతకైనా తెగిస్తారు. ఎక్కడదాకయినా వెళ్తారు. ఇందులో బిజెపి ప్రథమం కాదు. భారత రాష్ట్ర సమితి చివరిది కాదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్