బోధన్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బోధన్ నియోజకవర్గ బీజేపి అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి మద్దతుగా ఎడపల్లి మండలంలోని అంబెమ్, ఏఆర్పీ క్యాంపు, దుబ్బా తండా, బ్రాహ్మణ పల్లి, జైతాపూర్ గ్రామాల్లో ప్రచారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పాల్గోన్నారు. ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రెండు సార్లు గెలిచినా, ఎమ్మెల్యే షకీల్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలు సమస్యలు పరిష్కారించకుండా వున్నారని ఆరోపించారు. సైగా భు కబ్జా చేస్తూ , దందా చేస్తున్నాడు. స్వ లాభం చూసుకొంటున్న షకీల్ కు ప్రజలు వద్ద వచ్చే ధైర్యం లేదని అన్నారు. 75 సంవత్సరాలు వయస్సు ఉన్న కాంగ్రెస్ అభ్యర్ది సుదర్శన్ రెడ్డి కోట్ల ఆస్తి ఉన్నా కరోనా సమయం లో 10 పైసలు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ డిపాజిట్ కూడా రావు అని అన్నారు. బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డీ మోహన్ సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి, , ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.