న్యూఢిల్లీ, ఆగస్టు 16, వాయిస్ టుడే: ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపిక, విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకునే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. సాధారణంగా ఈ కమిటీ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత సమావేశమై అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. కాని, ఈసారి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాకముందే ఈ కమిటీ సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించకుంది. ఇలా ముందస్తుగా సమావేశం కావడం బహుశా ఇదే మొదటిసారి.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఈసీలో సభ్యులైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర సభ్యులందరూ పాల్గొంటారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో ఆ రాష్ట్రానికి చెందిన ఇతర కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఈసీలో మొత్తం 15 మంది సభ్యులున్నారుబలహీనంగా ఉన్న స్థానాలు గుర్తించడం, అక్కడ బలమైన అభ్యర్థులను నిలపడం వంటి కీలక అంశాలపై సీఈసీలో మేధోమధనం జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అధిక దృష్టి పెట్టాల్సిన స్థానాలను ఇప్పటికే బీజేపీ నాయకత్వం గుర్తించినట్టు సమాచారం. మధ్యప్రదేస్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు సంబంధించిన ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపిక అంతా ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఈ ఏడాది చివరిలోపు అంటే నవంబర్-డిసెంబర్‌లో ఐదు రాష్ట్రాలు – రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా్యి. ఈ ఐదు రాష్ట్రాల్లో కేవలం మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. మిజోరంలో మిత్ర పక్షం మిజో నేషనల్ ఫ్రంట్ – ఎంఎన్ఎఫ్ అధికారంలో ఉన్నా మణిపూర్ సంక్షోభం తర్వాత ఆ పార్టీతో బీజేపీ సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమిఫైనల్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.