- Advertisement -
సీఎం చంద్రబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ
BJP entrusted key responsibilities to CM Chandrababu
అమరావతి,
సీఎం చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ అభ్యర్థుల తరఫున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన న్యూఢిల్లీలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులను మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఢిల్లీలోని తెలుగు అసోసియేషన్ సైతం చంద్రబాబును ఆహ్వానించింది.
- Advertisement -