Wednesday, April 23, 2025

బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకోవాలి
బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులు
సీఎం రేవంత్ రెడ్డి
అహ్మదాబాద్

BJP leaders are more dangerous than the British: CM Revanth Reddy
అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ  విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.  మహత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ల గడ్డపైన, సబర్మతీ నది ఒడ్డున రెండు రోజులుగా మనం మేధో మదన (చింతన్ బైఠక్) సదస్సు జరుపుకుంటున్నాం.  అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మోదీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతీ ఒడ్డున మనం ఇక్కడ సమావేశమయ్యామని అన్నారు.   గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ  నాయకత్వంలో మనం ప్రయత్నిస్తున్నాం.  గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ  మిత్రులు, దేశ నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరూ మోదీకి వ్యతిరేకంగా పోరాడాలి.  మోదీ  రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చారు.. వాటికి వ్యతిరేకంగా రైతులు 14 నుంచి 15 నెలలు ధర్నాలు చేసినా చర్చలకు రాలేదు.  మోదీ మణిపూర్లో మంటలు రాజేశారు.. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం మోదీ చేశారు.
మరో వైపు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.  కుల గణన, రైతు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళల సంక్షేమంపై ఆయన
వాగ్దానాలు చేశారు.   పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు కుల గణన, రైతు రుణమాఫీ,  నిరుద్యోగ నిర్మూలన, మహిళల సంక్షేమానికి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారు..  రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని అన్నారు.
మేం తెలంగాణలో కుల గణన చేసి చూపించాం.  కుల గణనపై రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడాతారనే భయంతో ఆయనకు లోక్సభలో మోదీ మైక్ ఇవ్వ లేదు.  ప్రతి ఏటా  రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.  పదకొండు సంవత్సరాలు  దాటిపోయింది.. ఈ లెక్కన 20 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి.  మోదీ, అమిత్ షాకు ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయి…ప్రతి ఏటా 2 కోట్ల యువకులకు ఉద్యోగాలు రాలేదు.  దేశంలోని మూలమూలన ఉన్న గాంధేయవాదులు మోదీ వ్యతిరేక పోరాటంలో రాహుల్గాంధీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. గాంధీ ఆలోచనధారతో ఉన్న మనమంతా గాడ్సే వారసులను, మోదీని ఓడించాలి.  రైతులు, యువత, మహిళల కోసం సీడబ్ల్యూసీలో సాగిన చర్చలపై ఆశతో నేను ఇక్కడి నుంచి వెనక్కు వెళుతున్నా.   తెలంగాణలో మేం బీజేపీకి అవకాశం ఇవ్వం… గుజరాత్ గడ్డపై నుంచి నేను చెబుతున్నా.. మేం నిజాం ప్రభుత్వం కింద ఉన్నప్పుడు  జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో మాకు స్వాతంత్య్రం వచ్చింది.   అందుకే గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ  ప్రజలకు సంబంధం ఉందని అన్నారు.
గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దండి సత్యాగ్రహంతో పాటు 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారు.. .కానీ బ్రిటిష్వాళ్లు ఎప్పుడూ గాంధీజీ  మీద లాఠీ ప్రయోగం చేయలేదు.   స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే  వారసులు గాంధీజీపై  తుటా పేల్చి ఆయనను హత్య చేశారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులు… బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మనమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్