Sunday, September 8, 2024

సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా బిజెపి మేనిఫెస్టో..

- Advertisement -
BJP Manifesto aims at Sabka Saath Sabka Vikas.
BJP Manifesto aims at Sabka Saath Sabka Vikas.

బిజెపి మేనిఫెస్టోలో ప్రజా , రైతు, మహిళా సంక్షేమం, అభివృద్ధి కి అధిక ప్రాధాన్యత..

అన్ని వర్గాల ప్రజలను తృప్తి పరిచే విధంగా బిజెపి మేనిఫెస్టో రూపకల్పన

కాంగ్రెస్ బిఆర్ ఎస్ ప్రకటించిన పథకాలకు 70 వేల కోట్లు

5 లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు. కొత్త పథకాలకు డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ ల వి మోసపూరిత హామీలు ప్రజలు నమ్మి మోసపోవద్దు

పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి , టీఎస్పీఎస్సీ బోర్డు మాజీ సభ్యులు విట్టల్ వ్యాఖ్యలు

కరీంనగర్ నవంబర్ 20(వాయిస్ టుడే): జరగబోయే ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపకల్పన చేసిందని, ప్రధానంగా రైతుల, మహిళల, సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచన చేస్తుందని, బీసీ ముఖ్యమంత్రి , ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బిజెపి మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి , టీ ఎస్ పి ఎస్సీ బోర్డు మాజీ సభ్యులు విట్టల్ తెలిపారు. సోమవారం కరీంనగర్లోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సకల జనుల సౌభాగ్య తెలంగాణ ద్యేయంగా బిజెపి మోడీ గ్యారెంటీగా అమలు చేసే పథకాలనే మేనిఫెస్టో లో పొందుపరిచిందన్నారు . అందులో ప్రధానంగా అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని , తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టిబడి ఆ దిశగా పనిచేస్తుందనన్నారు. ముఖ్యంగా రైతాంగానికి లబ్ధి చేకూరే విధంగా వరికి రూ.1000 బోనస్ తో రూ.3100 కనీస మద్దతు ధర, రైతులకు ఉచితంగా పంట బీమా, అందించనుందన్నారు.
మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ఆడబిడ్డపుట్టగానే రూ. 2లక్షల ఫిక్స్డ్ డిపాజిట్,మహిళారైతుల కోసం కార్పొరేషన్ఏర్పాటు,స్వయంసహాయక డ్వాక్రా సంఘాలకు 1% వడ్డీ రుణాలు ,ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మహిళలకు 10లక్షల ఉద్యోగాలు,  ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 4 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, డిగ్రీ విద్యార్థినిలకు ఉచిత ల్యాప్ ట్యాప్ యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్, 6 నెలలకోసారి నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించిందన్నారు.

పెట్రోల్ పై వ్యాట్ తగ్గింపు, పేదలందరికీ నివాస గృహాలు అందించనుందని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు 5 లక్షల కోట్ల అప్పుల పాలైందని, కొత్తగా ప్రకటించిన ఆ రెండు పార్టీలు ప్రకటించిన పథకాలకు దాదాపు 70 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం జీతాలకే ఇబ్బంది పడుతున్న తెలంగాణ రాష్ట్రం లో స్కీం లను ఎలా కొనసాగిస్తారో ప్రజానికానికి చెప్పకుండా అధికారం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాన్ని ప్రజలంతా గ్రహించాలన్నారు . ప్రజలు ఆ రెండు పార్టీల మాటల్ని విశ్వసించవద్దని,. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా పనిచేసే బిజెపి మోడీ ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఇట్టి సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండ్ర నళిని, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి , దండు కొమరయ్య ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ , మాడ వెంకటరెడ్డి, గుర్రాల వెంకట్ రెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్, బండ రమణారెడ్డి, కార్పొరేటర్ లు రాపర్తి విజయ, బండ సుమ, దుర్షెట్టి అనూప్ తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్