మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించిన బీజేపీ బృందం

- Advertisement -

భూపాలపల్లి: తెలంగాణాలో బ్యారెజీని చుట్టు రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మేడిగడ్డ బ్యారెజీని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు.సీఎం కేసీఆర్నిర్లక్ష్యం కారణంగా లక్ష కోట్ల ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి తెలంగాణ మేధావుల మాట వినకుండా ప్రాజెక్ట్ నిర్మించి కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరిలో పోశారని మండిపడ్డారు. ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్కు సిగ్గుండాలని విమర్శించారు.

BJP team inspected Medigadda barrage
BJP team inspected Medigadda barrage

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి ఇతర నాయకులతో కలిసి శనివారం ఆయన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు హెలికాప్టర్లో చేరుకున్న వారికి స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం మేడిగడ్డ బ్యారేజీ గురించి అక్కడి సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోశారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్కు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్వహించాలని, వెంటనే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ పిల్లర్లు క్రాక్స్ వచ్చిన విషయం తెలియగానే కేంద్రమంత్రిగా కేంద్ర జల శక్తి కమిషన్కు లేఖ రాశానని, లేఖపై స్పందించిన నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. పరిశీలనకు వచ్చిన డ్యాం సేఫ్టీ టీమ్ రిపోర్ట్శుక్రవారం సబ్మిట్ చేసిందని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular