Sunday, September 8, 2024

వచ్చేది బీజేపీ రాజ్యమే

- Advertisement -

అదిలాబాద్ లో అమిత్ షా

bjp-will-come
bjp-will-come

అదిలాబాద్,  అక్టోబరు 10:  తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మనం ఇక్కడ నినదిస్తే హైదరాబాద్‌లో ఉన్న కేసీఆర్‌కు వినపడాలని అన్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ తన కుటుంబం కోసమే పని చేశారని అమిత్ షా అన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశామని కేసీఆర్ చెబుతుంటారని, రైతుల ఆత్మహత్యల విషయంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా కేసీఆర్ చేశారని అన్నారు. అవినీతి విషయంలోనూ నెంబర్ 1గా చేశారని అన్నారు.కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు కానీ, ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని ఎద్దేవా చేశారు.మోదీ సర్కారు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి శత్రువులను తరిమి కొట్టింది. అదేవిధంగా మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించింది. ప్రతి పేద మహిళకు మోదీ గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దళితులు, గిరిజనుల కోసం మోదీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు వేస్తున్నాం. ఒడిశాలో పుట్టి పెరిగిన పేద గిరిజన మహిళను మోదీ రాష్ట్రపతిని చేశారుతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అదేవిధంగా గిరిజనులకు 3 ఎకరాల భూమి, రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయని కేసీఆర్ పై విమర్శల వర్షం గుప్పించారు.రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని అమిత్ షా కేసీఆర్ సర్కారుపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మజ్లిస్ చేతిలోనే ఉందని, కేటీఆర్ ను సీఎం చేయాలన్నదే కేసీఆర్ సంకల్పమని కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు.తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని అమిత్ షా చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అక్కడా, ఇక్కడా మోదీయేనని అన్నారు. గిరిజన యూనివర్సిటీకి 10 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని అమిత్ షా మండిపడ్డారుపసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాబోతోంది అమిత్ షా పేర్కొన్నారు. కృష్ణా జలాల వాటా కోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది మోదీయేనని అమిత్ షా చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను గద్దె డించి బీజేపీకి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగించండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు అమిత్ షా..డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కార్ వస్తే విమోచన దినోత్సవం ప్రతీ జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు.డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కార్ వస్తే విమోచన దినోత్సవం ప్రతీ జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అక్కడా, ఇక్కడా మోదీయే ఉంటారంటూ వివరించారు.

పదేళ్లుగా గిరిజన వర్శిటీ తెలంగాణాలో ఏర్పాటు చెయ్యాలని మోదీ ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్థలమే ఇవ్వలేదని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికీ రజాకర్ల పోకడలు పోలేదని విమర్శించారు అమిత్‌షా. ఈనాటి రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది బీజేపీ మాత్రమే అంటూ నినదించారు. కేటీఆర్‌ని సీఎం చెయ్యడమే కేసీఆర్ లక్ష్యమన్నారు అమిత్‌షా. 2014 నుంచి సీఎం అదే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్‌ సర్కార్ కావాలన్నారు షా. డిసెంబర్ 3న తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే అంటూ అమిత్‌ షా ధీమా వ్యక్తంచేశారు.కృష్ణా జలాల పంపిణీ కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏమీ లేదంటూ అమిత్‌షా ఫైర్ అయ్యారు. తెలంగాణకు న్యాయం చేసేలా ట్రెబ్యునల్‌ ఏర్పాటు చేసింది మోదీ మాత్రమేనన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తోంది కేసీఆర్ కాదు.. మజ్లిస్ పార్టీ పెద్దలంటూ అమిత్ షా విమర్శించారు. కారు, స్టీరింగ్ అంటూ తనదైన స్టయిల్లో వ్యంగ్యంగా మాట్లాడారు.తెలంగాణ నెం.1 అంటూ పదేపదే బీఆర్ఆర్ నేతలు చెబుతున్నారని, కానీ, అవినీతిలో, మహిళలపై దాడుల్లో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నెం.1గా నిలిచిందంటూ అమిత్‌షా పేర్కొన్నారు.

bjp-will-come
bjp-will-come

ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అదేవిధంగా గిరిజనులకు 3 ఎకరాల భూమి, రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయని కేసీఆర్ పై విమర్శల వర్షం గుప్పించారు

ఆదిలాబాద్ సభలో ఈటల సంచలన వ్యాఖ్యలు

ఆదిలాబాద్ సభలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎక్కడైనా వచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్