75 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నం
రైతు బందును కాపీ కొట్టిన కేంద్రం 30లక్షల మందికి కూడా ఇస్తలేదు
అనంతారం బ్రిడ్జి రోడ్ల మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి పట్టించుకోలే
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. సంజయ్ కుమార్
జగిత్యాల: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 75 లక్షల మంది రైతులకు రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయం అందిస్తుంటే, మన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన మోదీ రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు కూడా ఇవ్వడం లేదని జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ . సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో అనంతారం, గుట్రాజ్‌పెల్లి గ్రామాల్లోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద మంది యువకులు, మహిళలు మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ లో చేరిన వీరికి ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ మాట్లాడుతూ అనంతారం గ్రామం మీదుగా వెల్తున్న జాతీయ రహదారిపై ఉన్న అనంతారం గ్రామం వద్ద ఉన్న లో లెవల్ బ్రిడ్జీ వల్ల ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో రోడ్ల భవనాల శాఖా మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి అనంతారం బ్రిడ్జి సమస్యను పరిష్కరించలేదని, నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవంద్ సైతం ఇటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి వంతెన సమస్యను పరిష్కరిస్తానన్నారు. గ్రామంలో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి 24గంటల విద్యుత్ సరఫరా, పుష్కలంగా నీలు, రైతు బంధు సాయంతో పంటలు సమృద్దిగా పండుతున్నాయన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల ఇండ్లలో నవ్వులు పూస్తున్నాయని, సీఎం కేసీఆర్ ఆద్వర్యంలో పెన్షన్ రాని ఇల్లులేదన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రతి పేదకు రూ. 5లక్షల ఉచిత బీమాను అందిస్తామని, ప్రతి మహిళకు రూ. 3వేల పెన్షన్‌ను అందిస్తామన్నారు. గడిచిన ఐదేండ్లు అవినీతిరహితంగా సేవచేశానని, మరో సారి అవకాశం ఇస్తే సమస్యలన్నీ తీర్చి మరింత అభివృద్ది చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,ఉప సర్పంచ్ మహేష్, శ్రీపాల్, సురేందర్, నాగరాజు, గంగన్న,శ్రీనివాస్,తిరుపతి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.