పిడుగురాళ్లలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
BJP's membership registration program in Pudugadali— ముఖ్యఅతిథిగా ఆరె వెంకటేశ్వర్లు
పిడుగురాళ్ల,
:భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా పిడుగురాళ్ల పట్టణం లో బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తాలూరి రాము ఆధ్వర్యంలో సభ్యత్వ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా కన్వీనర్, జిల్లా సభ్యత్వ కో ప్రముఖులు ఆరె వెంకటేశ్వర్లు హాజరైనారు. ఈ సందర్భంగా ఆరె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సమయము వారం రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి దాదాపుగా 15 క్రియశిలక సభ్యత్వలు చేయవలసి ఉన్నందున అందరు కలిసి ఈ 15 క్రియాశీలక స్వభ్యత్వలు పూర్తి చేయవలసిందిగా, అదేవిధంగా బూతు కమిటీ అధ్యక్షులను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో గురజాల అసెంబ్లీ కో కన్వీనర్ వడ్లమూడి వెంకయ్య, శ్రీనివాస్ నాయక్, అరుంధతి, అంజమ్మ, మణికంఠ, హేమంత్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు




