నేను పోలీస్ అవుతా ఆశీర్వదించండి…!!
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆసక్తికర ఘటన…!!
సీఐ ముత్యాల సత్యనారాయణ దగ్గరకు పాపను తీసుకొచ్చిన తండ్రి…!!
తన కూతురు పోలీస్ అవుతానని ఆశపడుతుందని దీవించాలి అంటూ పోలీసులకు వినతి…!!
క్యాపిటల్ వాయిస్, ఎన్టీ ఆర్ జిల్లా, మైలవరం:- చిన్న పిల్లలు సహజంగా పోలీసులను చూస్తే బయపడుతుండటం చూస్తుంటాం. మాట వినకపోతే పోలీసులకు అప్పజెబుతా అంటుంటాం. ఈ క్రమంలో పోలీసులను చూసిన ,వారు కనిపించినా పిల్లలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా పోలీసు ఉద్యోగం వైపు రావడానికి కూడా జంకుతూ ఉంటారు.. కానీ ఒక చిట్టి తల్లి మాత్రం నేను పోలీసు అవుతా నన్ను దీవించండి అంటూ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్ లో నివాసం ఉంటున్న అక్కిరెడ్డి పురుషోత్తం రెడ్డికి రెండేళ్ల పాప ఉంది. పాప పేరు అక్కిరెడ్డి జేష్వికా శ్రీ.. పాపకు పోలీసులు అంటే అమితమైన ఇష్టం అట. పోలీసులు కనిపిస్తే బుడి బుడి అడుగులు వేస్తూ సెల్యూట్ చేయడం చేస్తూ ఉంటుందట. అయితే గురువారం తన మూడవ పుట్టిన రోజు కావడం తో తండ్రి వినూత్నంగా ఆలోచన చేశారు. కూతురి పుట్టిన రోజు సందర్భంగా తనకు అత్యంత ఇష్టమైన పోలీసుల చేత ఆశీర్వచనాలు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ కు పోలీసు డ్రెస్ లో వచ్చి సీఐ ముత్యాల సత్యనారాయణ కు తన కూతురి కోరిక మేరకు తనను ఆశీర్వదించాలని కోరారు. తండ్రి కోరిన మేరకు స్పందించిన సీఐ ముత్యాల సత్యనారాయణ పాపను ఎత్తుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అవ్వాలని పాప కోరుకుంటున్న నేపథ్యంలో పోలీసు కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ ఐ అనూష సైతం పాపకు దీర్ఘాయుష్షు ఆశీర్వచనాలు అందించారు. పాప పోలీస్ స్టేషన్ కు రావడం పోలీసులు దీవించడం తో తండ్రి కోరిక తీరినట్లు అయింది. పాప పుట్టిన రోజు సందర్భంగా స్టేషన్ లో సిబ్బందికి మిఠాయిలు, కేక్ పంచిపెట్టారు. పాప పోలీసు అవ్వాలని కోరుకుంటుంది అని తెలియడం తో అందరూ ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు..
https://t.me/NewsbyNaveen