Sunday, September 8, 2024

బొమ్మ వెంకన్న సేవలు మరవలేనివి

- Advertisement -

-బొమ్మ వెంకన్న ఆశయలు కొనసాగిస్తాం

-ఘనంగా బొమ్మ వెంకన్న 82వ జయంతి వేడుకలు

తెలంగాణరాష్ట్ర మున్నూరుకాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లహరిశంకర్

కరీంనగర్ డిసెంబర్ 11(వాయిస్ టుడే) మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్లు(వెంకన్న) సేవలు మరవలేనివని తెలంగాణరాష్ట్ర మున్నూరుకాపురాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లహరిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బొమ్మకల్ వసతి గృహంలో బొమ్మ వెంకటేశ్వర్లు 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొమ్మ వెంకన్న విగ్రహనికి చల్లహరిశంకర్ తో పాటు జిల్లా మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షులు గంగుల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, ట్రస్టు చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి .హాస్టల్ ఇంచార్జీ మప్పిడి బాలకృష్ణ, పసుల్ల మైపాల్, జిల్లా సమన్వయకర్త సత్తినేని శ్రీనివాస్ లు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చల్లహరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యతతో ముందుకు సాగితే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతారని బొమ్మ వెంకన్న అనాడే చెప్పారన్నారు. మున్నూరుకాపులకు ఐకాన్ బొమ్మ వేంకటేశ్వర్లు అని వారి ఆశయ సాధనలో ముందుకు సాగలన్నారు. మున్నూరుకాపుల బిడ్డలు చదువుతోనే అన్ని రంగాల్లో ఎదుగుతారిని ఆలోచించారని తెలిపారు. పేద విద్యార్థులకు వసతి గృహా ఏర్పాటుతో ఉన్నత చదువులు అభ్యసించాలని బొమ్మకల్ మూడున్నర ఎకరాల స్థలం లో వసతిగృహాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు బంగారు బాటులు వేశారని కొనియాడారు. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్న ఆయన ఆశయ సాధన మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బొమ్మకల్ వనతి గృహా నముదాయంలో రూ. రెండున్నరకోట్ల తో కళ్యాణమండపం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో విద్యార్థి వసతి గృహాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవిందర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. మున్నూరు కాపుల ఐక్యతకు పెద్ద పీట వేశారని కొనియాడారు. బొమ్మ వెంకన్న ఆయశసాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస పటేల్, ప్రధాన కార్యదర్శి సూదుల వెంకటరమణ పటేల్ రాచమల్ల నుగుణాకర్ పటేల్, సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శలు నగర, డివిజన్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్