ఎమ్మెల్యేగా గెలవబోయేది ఇక్కడే….
రాజకీయ లబ్దికోసం తిరిగి వస్తే లోకల్ ఎలా అవుతాడు
ఖమ్మం రూరల్ మండల ఎన్నికల ప్రచారంలో పొంగులేటి
ఖమ్మం రూరల్ : శీనన్నగా మీ అందరికీ సుపరిచితుడిని అయిన నేను…. ఖమ్మంజిల్లాలోనే పుట్టి పెరిగా…రాజకీయాలను కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం ఎంపీగా మీ దీవెనలతో గెలిచా…. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ ఆశీస్సులు… దీవెనెలతో ఎమ్మెల్యేగా నేను గెలవబోయేది కూడా ఇక్కడే …. అతని లాగా ఇక్కడ పుట్టి ఎక్కడో స్థిరపడి… రాజకీయ లబ్దికోసం తిరిగి రాలేదు… అలాంటి వ్యక్తి లోకల్ ఎలా అవుతాడు… ఓడిపోతే మళ్లీ తట్టబుట్ట సర్దుకుని తిరిగి హైదరాబాద్ కే వెళ్తాడంటూ కందాల ఉపేందర్ పై పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘాటు విమర్శలు చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాల పాడు, చిన్న వెంకటగిరి, గుదిమళ్ల పంచాయితీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి చోటా స్థానికులు పొంగులేటి పూలతో, కోలాట నృత్యాలతో, డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వివరిస్తూ… ప్రజలకు అభివాదం చేస్తూ పొంగులేటి ముందుకు సాగారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గానికి ఏం చేశాడో… మళ్లీ గెలిస్తే ఏం చేయబోతాడో చెప్పకుండా స్థానికుడు, స్థానికేతరుడు అనే వివాదానికి తెరలేపింది కందాలనేనని గుర్తు చేశారు.
ఎక్కడో డబ్బులు సంపాదించుకుని తాను ఇక్కడకు రాలేదని ఇక్కడే పుట్టి పెరిగి రాజకీయాల్లోకి వచ్చానని ఈ విషయం ఉమ్మడి ఖమ్మంజిల్లా యావత్తు ప్రజానీకానికి తెలుసునన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస రెడ్డి, ధరావత్ రామ్మూర్తి నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి, బైరు హరినాథ్ బాబు, మద్ది మల్లా రెడ్డి, కన్నెటి వెంకన్న, గోనె భుజంగ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, బొల్లం వెంకన్న, మెండె వెంకటేష్ యాదవ్, భద్రకాళి, రానేరు మురళి, పేరం శ్రీను, వెంకటేశ్వర్లు, మహేష్, సీపీఐ నాయకులు మహ్మద్ మౌలానా