- Advertisement -
ప్రేయసి పిలిచిందని వెళ్లి అడ్డంగా బుక్
Boyfriend went to his Girlfriend and Booked
హైదరాబాద్, ఆగస్టు 31 (న్యూస్ పల్స్)
గాజులరామారం కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు.. కొద్ది రోజల క్రితం ఒక బార్ ముందు పెట్రోల్ దొంగతనం చేస్తున్న వ్యక్తులను బార్ సిబ్బంది అడ్డగించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గాజులరామారం వద్ద ఉన్న LN బార్ ముందు ఆగి ఉన్న వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తున్న వ్యక్తులను బార్ సిబ్బంది అఖిలేష్ అడ్డుకున్నాడు.. అప్పటికే స్పాట్‌లో ఉన్న ముగ్గురు నిందితులు పూర్ణిమ, గౌతమ్, అజయ్‌లు బార్ సిబ్బందిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే గొడవ పెద్దది కావడతో పూర్ణిమ తన స్నేహితుడు నరేష్‌కు ఫోన్ చేసింది. దీంతో హుటాహుటిన నరేష్ తనతో పాటు గ్యాంగ్ మొత్తాన్ని బార్ వద్దకు తీసుకువచ్చాడు. ఇద్దరి మధ్య మాట పెరగటంతో నరేష్ తన వద్ద ఉన్న గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. అయితే, గాల్లోకి కాల్పులు జరపడంతో బార్ సిబ్బంది అఖిలేష్, నితీష్ భయపడిపోయారు. అక్కడినుండి పారిపోయిన నిందితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు బార్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు సిసిటీవీ కెమెరా విజువల్స్ ఆధారంగా మొత్తం 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వీరిలో ప్రధాన నిందితుడు నరేష్ గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే నరేష్ కు తుపాకీ ఎక్కడినుండి వచ్చిందని విషయంపై పోలీసులు ఆరా తీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బెదిరింపులకు పాల్పడి డాన్ గా ఎదగాలనుకుంటున్నానని.. అందుకే తుపాకీ కొనుక్కున్నాను అంటూ నరేష్ పోలీసులకు సమాధానమిచ్చాడు. నరేష్ పై త్వరలోనే పిడి యాక్ట్ పెడతామని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ తగాదాల కోసమే తుపాకీ కొనుక్కున్నానని.. చెప్పడం చర్చనీయాంశంగా మారింది.. ఇదే తరుణంలో పూర్ణిమ ఫోన్ చేసి రమ్మని పిలిచేసరికి తాను తుపాకీతో అక్కడికి చేరుకుని.. అక్కడున్న వారిని బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్టు నరేష్ పోలీసుల ముందు అంగీకరించాడు. మొత్తం 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.నిందితుల నుంచి నాటు తుపాకీ, 87 బుల్లెట్లు, తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ప్రధాన నిందితుడు నరేశ్‌తోపాటు శివ, సోహెల్, శ్యాంసన్, నరేందర్, ఉజ్వల్ సహా 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
- Advertisement -