జాతి కోసం నిలబడి కొట్లాడిన వీరవనితలు.. సమ్మక్క, సారలమ్మలు
గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనికులు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
మేడారం జనవరి 30
Brave women who stood up and fought for the nation.. Sammakka, Saralamma: Telangana Jagruti President Kavitha
జాతి కోసం నిలబడి కొట్లాడిన వీరవనితలు.. సమ్మక్క, సారలమ్మలని,గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనికులు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.శుక్రవారం సమ్మక్క, సారలమ్మలను దర్షించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజలు బాగుండాలని సమ్మక్క, సారలమ్మలను కోరుకోవటం జరిగింది.కాకతీయుల వంటి రాజులతో కొట్లాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు. వారి జాతి కోసం నిలబడి కొట్లాడిన వీరవనితలు. గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనికులు. అని కొనియాడారు.వారి స్ఫూర్తితోనే మేము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి ఉంది. సామాజిక న్యాయం అందరికీ ఇప్పటికీ దక్కలేదు. ఈ పరిస్థితి పోయేలా మేము జాగృతి తరఫున మా వంతు కృషి చేస్తామన్నారు.


